హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పదేళ్లకు దొరికిన రేప్ కేసు దోషి: దేవత పేరుతో..

By Pratap
|
Google Oneindia TeluguNews

Rape case culprit arrested after 10 years
హైదరాబాద్: మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో శిక్షపడిన వ్యక్తి పదేళ్లుగా తప్పించుకుని తిరుగుతూ ఎట్టకేలకు హైదరాబాదులోని సైదాబాద్‌ పోలీసులకు దొరికాడు. 2001లో సైదాబాద్‌ కాలనీలోని నాగరాజు అలియాస్‌ బజంత్రీ రాజు ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ కేసులో 2001లో నాంపల్లి కోర్టు రాజుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టుకు వెళ్లగా అదే శిక్షను ఖరారు చేసింది. దీంతో పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరకు సైదాబాద్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాసులు కేసుపై ప్రత్యేక దృష్టి సారించి ఒక బృందాన్ని రాజు స్వగ్రామమైన కర్నూల్‌ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలని కోటకందుకూరు పంపారు. అక్కడ రాజును అరెస్ట్‌ చేశారు. అతడ్ని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా గతంలో విధించిన శిక్షను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాజును చర్లపల్లి జైలుకు తరలించారు.

తనకు దేవత ఆవహిస్తుందని, అందరి భవిష్యత్తు చెబుతానంటూ మాయ మాటలు చెప్పి బంగారం, నగదు తీసుకుంటున్న ఓ మహిళను సికింద్రాబాదులోని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 25.76 తులాల బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన కుసుమ్‌ సౌధాయ్‌ కొద్ది కాలం క్రితం నగరానికి వచ్చి హైదరాబాదులోని ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీ, సాయిసౌధ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటుంది.

తనకు దేవత అవహిస్తుందని తాను అందరి కష్టాలు తొలగిస్తానంటూ మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తుంది. సికింద్రాబాద్‌ ఎస్‌డి రోడ్డుకు చెందిన ఎస్‌ఆర్‌ సతీష్‌కుమార్‌ కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన వద్ద పనిచేస్తున్న వారి సలహా మేరకు కుసుమ్‌సౌధాను కలిశాడు. కొన్ని పూజలు చేయాలంటూ లక్షల రూపాయల డబ్బు , బంగారు, వెండి అభరణాలను తీసుకుంది.

తాను చేస్తున్న పూజల గురించి ఎవరికి చెప్పవద్దని లేదంటే భార్య, పిల్లలకు ప్రాణ హానీ అని హెచ్చరించింది. పూజల్లో భాగంగా సతీష్‌ ఇంటికి వచ్చిన కుసుమ్‌ బిరువాలో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసింది. మోసపోయిన్నట్టు తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
Culprit in a rape case in Hyderabad has been nabbed by police after ten years,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X