గో టు హెల్: రాజకీయాలు-పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌పై రష్మి ఏమన్నారంటే
హైదరాబాద్: యాంకర్ రష్మీ మంగళవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇందులో భాగంగా వినోదం, ఇతర అంశాలతో పాటు రాజకీయ అంశాలను కూడా నెటిజన్లు స్పృషించారు. దానికి కూడా రష్మీ సమాధానం చెప్పారు.
మీరు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే, వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీకి మద్దతు పలుకుతారని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దానికి ఆమె అలాంటి ప్లాన్‌లు ఏమీ లేవని తేల్చి చెప్పారు.
మరో నెటిజన్ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. దానికి సదరు నెటిజన్.. మీరు ఈ మెసేజ్‌ను పక్కకు పెడుతున్నారని, సరే.. మీ భవిష్యత్తుకు బెస్ట్ అఫ్ లక్ అని పేర్కొన్నారు. దానికి రష్మి స్పందిస్తూ... ఓటింగ్ సీక్రెట్‌గా జరుగుతుందని, రాజకీయ వ్యూస్ వ్యక్తిగతమని ఆమె చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లోని ఏ కులాన్ని మీరు ఇష్టపడతారని, ఈ కులానికి మద్దతు పలకండంటూ ఓ కులం పేరు చెబుతూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. అంతేకాదు, మేం పాలించేవాళ్లమని, జై టీడీపీ అని పేర్కొన్నారు. దానికి రష్మీ తీవ్రంగా స్పందించారు. కులాల గురించి మాట్లాడే వాళ్లు వద్దు.. గో టు హెల్ అన్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం గురించి చెప్పాలని మరో నెటిజన్ ప్రశ్నించగా, మనం రాజకీయాల్లో చూడాలనుకున్న మార్పును జనసేనాని తీసుకు వస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications