తండ్రి పలుకుబడి: ఇంట్లో బీటెక్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ ఆర్డీవో అధికారి కొడుకు
హైదరాబాద్: బీటెక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న పలువురు విద్యార్ధులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నగరంలోని హయత్ నగర్‌లో చోటు చేసుకుంది. హయత్ నగర్‌లోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన కొందరు విద్యార్ధులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది.
నిజానికి విద్యార్ధులు నారాయణ కాలేజీ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉంది. అయితే తండ్రి పలుకుబడితో పరీక్ష పేపర్‌ను ఇంటికి తెప్పించుకుని తన స్నేహితులతో కలిసి పరీక్ష రాస్తున్న విద్యార్ధి నిఖిల్‌తో పాటు మిగతా నలుగురు విద్యార్ధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు దాడుల్లో అరెస్టైన విద్యార్ధి నిఖిల్ తండ్రి ఆర్డీవో అధికారి కావడం విశేషం.
మాస్ కాపీయింగ్‌పై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఐదుగురు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆయన పలుకుబడితోనే పరీక్ష పత్రాలను ఇంటికి తీసుకెళ్లి పరీక్ష రాస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురు విద్యార్ధులను హయత్‌నగర్ పోలీసులకు అప్పగించారు.

వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీ ఉప్పల సూరి పరారీ
వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీ ఉప్పల సూరి పరారవ్వడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... వరంగల్ కేంద్ర కారాగాంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉప్పలసూరిని పోలీసులు సోమవారం వరంగల్ కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకొచ్చారు. విచారణ పూర్తైన తర్వాత అతడిని భూపాలపల్లి డిపో బస్సులో వరంగల్‌కు తీసుకెళ్తున్నారు.
యశ్వంతాపూర్ సమీపానికి రాగానే తాను ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును ఆపాలని కోరాడు. మల విసర్జన చేయాలని కోరడంతో పోలీసులు బస్సును ఆపారు. దీంతో మూత్రానికని పొదల్లోకి వెళ్లిన సూరి ఎప్పటికీ తిరిగి రాలేదు. దీంతో పరారయ్యాడని గ్రహించిన పోలీసులు అటువైపు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
అయినా అతని ఆచూకీ దొరక్కపోవడంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అదనపు బలగాలను రప్పించి, ఆ చుట్టపక్కల పరిసరాల్లో అతడి కోసం గాలింపు చేపట్టింది.












Click it and Unblock the Notifications