ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్: ఇద్దరు సజీవ దహనం
నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండల పరిధిలోని వెలిమినేడు శివారులోని హెండీస్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో పనిచేస్తున్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు.
పరిశ్రమ చుట్టూ పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం కాగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలు గురవుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications