వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యాపేట గ్యాలరీ ప్రమాదానికి కారణమదే.. క్షతగాత్రులకు ఒళ్లంతా ఫ్రాక్చర్స్... శివసాయి డెకరేషన్స్‌పై కేసు...

|
Google Oneindia TeluguNews

నాణ్యతా లోపమా... లేక సామర్థ్యాన్ని మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్ల జరిగిన ప్రమాదమా... నిన్నటి సూర్యాపేట గ్యాలరీ ప్రమాద ఘటనపై ఇదే చర్చ జరుగుతోంది. నాణ్యతా లోపమే ప్రమాదానికి కారణమని బాధితులు ఆరోపిస్తుండగా... గ్యాలరీలో పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని సూర్యాపేట పోలీస్ అధికారి భాస్కరన్ తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మొత్తం 150 మంది వరకు గాయాలపాలవగా... వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.క్షతగాత్రుల్లో చాలామందికి ఒళ్లంతా ఫ్రాక్చర్స్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

శివసాయి డెకరేషన్స్‌పై కేసు...

శివసాయి డెకరేషన్స్‌పై కేసు...

గ్యాలరీ స్టాండ్ నిర్మాణంలో ఇనుప రాడ్లకు బదులు కర్రలు ఉపయోగించడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. నాణ్యతా లోపానికి తోడు సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో భారీ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. గ్యాలరీ స్టాండ్ నిర్మాణం చేపట్టిన శివసాయి డెకరేషన్స్‌పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం స్టేడియంలోని మిగతా గ్యాలరీలను కూడా తొలగిస్తున్నారు. ప్రేక్షకులు నేల పైనే కూర్చొని కబడ్డీ మ్యాచ్‌లను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సూర్యాపేట జాతీయ కబడ్డీ పోటీల్లో అపశృతి... ఒక్కసారిగా కుప్పకూలిన గ్యాలరీ... 200 మందికి గాయాలుసూర్యాపేట జాతీయ కబడ్డీ పోటీల్లో అపశృతి... ఒక్కసారిగా కుప్పకూలిన గ్యాలరీ... 200 మందికి గాయాలు

బాధితుల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు...

బాధితుల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు...


బాధితుల్లో ఒకరి కుటుంబ సభ్యుడు ఘటనపై మాట్లాడుతూ... ప్రమాదం జరిగిన తర్వాత తమవాళ్లు ఎక్కడున్నారో గుర్తించడం కష్టమైందన్నారు. ఎలాగోలా జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ... అప్పటికే ఆస్పత్రికి కిక్కిరిసిపోయిందన్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. తమవాళ్లకు కాళ్లు,నడుములు విరిగిపోయాయని అన్నారు.అంతా క్షణాల్లో జరిగిపోయిందని... అసలేం జరిగిందో ఎవరికీ ఏం అర్థంకాలేదని తెలిపారు.

నలుగురి పరిస్థితి విషమం...

నలుగురి పరిస్థితి విషమం...

ప్రమాద అనంతరం పోలీసులు,స్థానిక అధికారులు,టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు,వాలంటీర్లు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులతో జనరల్ ఆస్పత్రి కిక్కిరిసిపోయింది. వారి హాహాకారాలతో అక్కడ భీతావహ వాతావరణం కనిపించింది. నలుగురు బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్‌లోని కామినేని,యశోద ఆస్పత్రులకు తరలించినట్లు సమాచారం. ప్రమాద ఘటనపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ఇది చాలా దురదృష్టకర సంఘటన అన్నారు. ఎవరికి ప్రాణహాని లేదని... చాలామందికి స్వల్ప ఫ్రాక్చర్స్ అయ్యాయని అన్నారు. ప్రస్తుతం బాధితులందరికీ చికిత్స అందుతోందని తెలిపారు. ప్రమాద ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో తొలిసారి జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. దేశంలోని 29 రాష్ట్రాల క్రీడాకారుల ఇందులో పాల్గొంటున్నారు. ఏర్పాట్లు కూడా భారీగానే చేశారు. సాయంత్రం 7గంటలకు మొదటి కబడ్డీ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అంతకు 15నిమిషాల ముందు ఊహించని రీతిలో గ్యాలరీ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా గ్యాలరీ కుప్పకూలడంతో స్టేడియంలో ఉన్నవారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. క్షతగాత్రులను వెనువెంటనే ఆస్పత్రికి తరలించారు. చాలామంది గ్యాలరీ శిథిలాల కింద చిక్కుకుపోవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.

English summary
At least 150 persons were injured when a spectators’ gallery collapsed on the opening day of the junior National Kabbadi Championship in Suryapet town in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X