వచ్చేఎన్నికల్లో అడ్రెస్ గల్లంతే.. రేగా కాంతారావు వర్సెస్ పొదెం వీరయ్య; భద్రాద్రిలో ఎమ్మెల్యేల సవాళ్ళపర్వం!!

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి నుంచే ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఒకవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీలో అసమ్మతి కుంపటి, మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం వెరసి ఖమ్మం జిల్లాలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది.

భద్రాద్రి జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య సవాళ్ళ పర్వం

భద్రాద్రి జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య సవాళ్ళ పర్వం

తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అడ్రెస్ గల్లంతు చేస్తామంటూ నేతలు సవాళ్లు విసురుకోవటం ఆసక్తికరంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పరస్పరం సవాల్ విసురుకుంటున్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు మధ్య మాటల యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రేగా కాంతారావు, పొదెం వీరయ్య మధ్య మాటల మంటలు రగులుతున్నాయి.

ఓడిస్తానన్న రేగా... దమ్ముంటే ఓడించు అంటున్న పొదెం వీరయ్య

ఓడిస్తానన్న రేగా... దమ్ముంటే ఓడించు అంటున్న పొదెం వీరయ్య

2023 తర్వాత పొదెం వీరయ్య అడ్రస్ వెతుక్కోవాలి అంటూ రేగా కాంతారావు పొదెం వీరయ్య ను టార్గెట్ చేస్తూ ఆయనకు వచ్చే ఎన్నికలలో నియోజకవర్గంలో అడ్రెస్ లేకుండా చేస్తానని సవాల్ విసిరారు. ఇక దమ్ముంటే ఓడించు అంటూ పొదెం వీరయ్య రేగా కాంతారావు కు సవాల్ విసిరారు. భద్రాద్రి జిల్లాలో ఐదు సీట్లు కాదు కదా నువ్వు కూడా గెలవలేవు అంటూ పొదెం వీరయ్య రేగా కాంతారావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన రేగా కాంతారావు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

భద్రాద్రి జిల్లాలో అప్పుడే ఎన్నికల వేడి

భద్రాద్రి జిల్లాలో అప్పుడే ఎన్నికల వేడి

నా దగ్గర నువ్వు మోకాళ్ల యాత్ర చేసినా నా గెలుపును ఆపలేవు వీరయ్య గారు అంటూ పేర్కొన్నారు. మీ ఓటమి ఖాయమైంది. ఇంకో నియోజకవర్గం చూసుకో.. దాని సంగతి కూడా చూస్తా అంటూ రేగా కాంతారావు పేర్కొన్నారు. 2023 ఎన్నికల తర్వాత నీ అడ్రస్సు ఎక్కడుందో చూద్దామంటూ రేగా కాంతారావు పొదెం వీరయ్య కు సవాల్ విసిరారు. మరి ఇరువురు నేతల సవాళ్లు ప్రతిసవాళ్లు మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తుంది. ఇరువురు నేతలు సవాళ్లపై స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+