వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నేను రాను బిడ్డో అనొద్దు’: వైద్యారోగ్యశాఖపై కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడానికి వైద్య ఆరోగ్య శాఖకు అడిగనన్ని నిధులు కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు' అని పాటలు పాడుకునే జనం ఇక ‘నుంచి నేను కచ్చితంగా సర్కారు దవాఖానకేపోయి వైద్యం చేయించుకుంటాననే పరిస్థితి రావాలి' అని అన్నారు.

‘వైద్యారోగ్యశాఖకు కోరినన్ని నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పీహెచ్‌సీలు మొదలుకుని టీచింగ్ హాస్పిటల్స్‌వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితులు మెరుగుపడాలి. సర్కారు దవాఖానాల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, ఇతర పోస్టులను వందకు వందశాతం భర్తీ చేస్తాం. అవసరమనుకున్న పోస్టులు మంజూరు చేస్తాం. అన్ని వైద్యశాలలకు అవసరమైన రోగనిర్ధారణ పరికరాలు కొనుగోలు చేస్తాం. మందులన్నీ అందుబాటులో ఉంచుతాం' అని సీఎం కెసిఆర్ చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.

వైద్యఆరోగ్య శాఖ బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో పునఃసమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వివిధ శాఖల కార్యదర్శులు బీపీ ఆచార్య, రాజేశ్వర్‌ తివారీ, రామకృష్ణారావు, శివశంకర్‌, నవీన్‌మిత్తల్‌, నర్సింగ్‌రావు, జ్యోతి బుద్ధప్రకాశ్‌, వైద్య ఆరోగ్య శాఖ వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రుల వారీగా కేటాయించిన నిధులను స్థానిక అవసరాలకు వినియోగించుకునే హక్కును సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. విభాగాల అధిపతుల నుంచి అధికార వికేంద్రీకరణ జరగాలనీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు తమ పరిధిలో కావాల్సిన పనులు తామే చేసుకోవడానికి అవకాశమిస్తామన్నారు.

అన్ని ఆసుపత్రుల్లోనూ పూర్తిస్థాయిలో వైద్య పరికరాలను సమకూర్చటానికి నిధులెన్ని అవసరమో అంచనావేసి బడ్జెట్లో కేటాయించాలని ఆదేశించారు. పరికరాల కొనుగోలు కోసం రాష్ట్ర స్థాయిలో వైద్య విద్య సంచాలకులు, ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌లతో కూడిన కమిటీ.. ధరలను, నాణత్యను నిర్ణయించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఆస్పత్రుల వారీగా నిర్వహణ నిధులు కేటాయించి, వాటిని నెలవారీగా విడుదల చేయాలని సీఎం చెప్పారు. అన్ని స్థాయుల ఆస్పత్రులు కలుపుకొని పడకల సంఖ్య 21వేలకు పైగా ఉంటుందని అధికారులు తేల్చారు. పడకల వారీగా నిర్వహణ వ్యయాన్ని కేటాయించి నెలవారీగా నిధుల విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఆ నిధులతో ఆస్పత్రులను ఆధునీకరించాలనీ, ప్రతిరోజూ పడకలపై దుప్పట్లను, దిండ్లను మార్చాలనీ, ఆసుపత్రులకు రంగులు, సున్నాలు వేయించాలనీ, ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సీఎం కెసిఆర్ సమీక్ష

సీఎం కెసిఆర్ సమీక్ష

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడానికి వైద్య ఆరోగ్య శాఖకు అడిగనన్ని నిధులు కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు.

సీఎం కెసిఆర్ సమీక్ష

సీఎం కెసిఆర్ సమీక్ష

‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు' అని పాటలు పాడుకునే జనం ఇక ‘నుంచి నేను కచ్చితంగా సర్కారు దవాఖానకేపోయి వైద్యం చేయించుకుంటాననే పరిస్థితి రావాలి' అని అన్నారు.

సీఎం కెసిఆర్ సమీక్ష

సీఎం కెసిఆర్ సమీక్ష

వైద్యఆరోగ్య శాఖ బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో పునఃసమీక్ష నిర్వహించారు.

సీఎం కెసిఆర్ సమీక్ష

సీఎం కెసిఆర్ సమీక్ష

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వివిధ శాఖల కార్యదర్శులు బీపీ ఆచార్య, రాజేశ్వర్‌ తివారీ, రామకృష్ణారావు, శివశంకర్‌, నవీన్‌మిత్తల్‌, నర్సింగ్‌రావు, జ్యోతి బుద్ధప్రకాశ్‌, వైద్య ఆరోగ్య శాఖ వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్, పౌర సరఫరాలపై సీఎం సమీక్ష

విద్యుత్, పౌర సరఫరాలపై సీఎం సమీక్ష

ప్రజలకు తక్కువ ధరకు నిత్యావసర సరుకులు అందాలనే లక్ష్యంతో పౌర సరఫరాల శాఖ చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.

మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలనీ, మంచినీటి సౌకర్యం కల్పించాలనీ, లైట్లు, ఫ్యాన్లు పనిచేసే విధంగా చూడాలనీ, దోమలు ఈగలు వాలకుండా పరిశుభ్రతను పాటించాలన్నారు. ఈ నిర్వహణ వ్యయం వీలైతే ప్రతి నెలా 25వ తేదీలోగా ఆయా ఆస్పత్రులకు అందాలని సీఎం చెప్పారు.

అలాగే, గ్రామీణ, మారుమూల అటవీ ప్రాంతాల్లో వైద్యసేవలు సక్రమంగా అందించేందుకు ప్రాధాన్యమివ్వాలనీ, ఈ ప్రాంతాల్లో పనిచేయడానికి వైద్యులు సుముఖంగా లేనందున వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించాలని సీఎం నిర్ణయించారు. వీరికి అదనపు నగదు ప్రోత్సాహకాలు అందజేయాలనీ, స్థానికంగానే నివాసం ఉండాలనే నిబంధనను సడలించి పక్క పట్టణంలో ఉండే అవకాశం కల్పించాలన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సంఖ్యను పెంచి షిఫ్టు విధానాన్ని అమలుచేయాలనీ, సామాజిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోకి తీసుకురావాలనీ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను మాత్రం ప్రజారోగ్య విభాగంలోనే ఉంచాలని సీఎం వెల్లడించారు. 108, 104 సేవలను మరింత పటిష్ఠంగా అమలుచేయాలన్నారు.

రోగ నిర్ధారణ కోసం ప్రజలు పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తోందనీ, ప్రైవేటు నిర్ధారణ పరీక్ష కేంద్రాల దోపిడీకి గురవుతున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులను నివారించేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్థాయిని బట్టి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనీ, ఇందుకు అవసరమైన పరికరాలను కొనిస్తామన్నారు.

జిల్లా, బోధనాసుపత్రుల్లో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ సహా అన్ని రకాల రోగ నిర్ధారణ పరికరాలను అందుబాటులో ఉంచాలనీ, నిర్ధారణ పరీక్షలతో పాటు అన్ని రకాల ఔషధాలను రోగులకు ఉచితంగా అందించాలని తెలిపారు. ఏ ఆసుపత్రిలో ఏ రకమైన ఔషధాలుండాలనేది ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లే నిర్ణయం తీసుకొని కొనుగోలు చేయాలని ఆదేశించారు.

తక్కువ ధరలో మందులు దొరికేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్‌ ఔషధ దుకాణాలను ప్రారంభించాలని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్‌, గైనకాలజీ, పిడియాట్రిక్స్‌ తదితర విభాగాలన్నీ మరింత మెరుగుపడాల్సిన అవసరముందన్నారు.

‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు' వినపడకూడదు

అత్తో పోదాం రాయే.. మన ఊరి దవాఖానకు.. మందులు, గోళీలు.. మంచి సూదులు ఇత్తుండ్రంట.. అని పాడుకునే రోజులు రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. సర్కారు దవాఖానలతీరుపై ఎప్పుడో మూడుదశాబ్దాల కిందట వచ్చిన నేటి భారతం సినిమా పాటను ఈ సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకునే పద్ధతి పోవాలని సూచించారు.

English summary
Chief Minister K. Chandrasekhar Rao on Wednesday ordered hospital-wise release of maintenance cost on monthly basis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X