జిహెచ్ఎంసి: నేరచరితుల లిస్ట్ విడుదల, 'బాబుకు ఆంధ్రా ఓటర్లు కావాలి కానీ'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నేర చరితుల జాబితాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గురువారం నాడు విడుదల చేసింది. ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, టిడిపి, మజ్లిస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులలో నేర చరితుల జాబితాను విడుదల చేశారు.
72 మందితో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ జాబితాను విడుదల చేసింది. అందులో అధికార టిఆర్ఎస్ పార్టీలోనే ఎక్కువ మంది నేర చరితులు ఉన్నారు. 72 మందిలో 64 మంది పురుషులు, 8 మంది మహిళలు నేర చరిత కలిగి ఉన్నారు.
పార్టీల వారీగా చూస్తే.. టిఆర్ఎస్ - 14, టిడిపి - 13, కాంగ్రెస్ - 13, మజ్లిస్ - 11, బిజెపి - 4, ఎంబీటీలో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు, బీఎస్పీ ఒకరు, ఎస్పీ ఒకరు, స్వతంత్రుల్లో 11 మంది అభ్యర్థులు నేర చరితర కలిగి ఉన్నారు.

హైదరాబాద్‌లోని ఆంధ్రా ఓటర్లు కావాలి కానీ...: నారాయణ
హైదరాబాదులోని ఆంధ్రా ఓటర్ల ఓట్లు కావాలి గానీ.. ఆంధ్రా విద్యార్థధి చనిపోతే పట్టించుకోరా అని సిపిఐ నేత నారాయణ విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సియు విద్యార్థి వేముల రోహిత్ కులంపై విచారణ జరపాలని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు.
దేశంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం చేతుల్లో రాష్ట్ర గవర్నర్లు కీలు బొమ్మల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ఇదే విషయం మరోసారి స్పష్టమైందన్నారు.












Click it and Unblock the Notifications