ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డికి రిలీఫ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డికి భారీ ఊరట లభించింది . ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయన భార్య కనికా రెడ్డి అనారోగ్య కారణాల వల్ల ఆయనకు న్యాయస్థానం పూర్తిస్థాయిలో బెయిల్ ఇచ్చింది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డికి జనవరి 27వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తు తో అప్పుడు శరత్ చంద్రారెడ్డి నానమ్మ మరణించగా ఆమె అంత్యక్రియల దృష్ట్యా శరత్ చంద్రా రెడ్డి కి బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. ఇక ప్రస్తుతం మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకు అప్పీలు చేయగా ఆయన భార్య అనారోగ్య కారణాలతో న్యాయస్థానం పూర్తిస్థాయిలో బెయిల్ మంజూరు చేసింది.

 Sarath Chandra Reddy in Delhi liquor scam

ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రా రెడ్డికి సంబంధించిన మూడు కంపెనీల ద్వారా అరవై నాలుగు కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అందులో 60 కోట్ల రూపాయలు ఇండో స్పిరిట్ కంపెనీకి తరలించినట్లు గా విచారణలో తేలినట్లు ఈడీ అధికారులు చార్జిషీట్లో పేర్కొన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో భాగంగా, ఢిల్లీ మద్యం వ్యాపారంలో 30 శాతం దుకాణాలను శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. బినామీ కంపెనీలతో కలిసి 9 జోన్లలో శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారాన్ని నిర్వహించినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సౌత్ గ్రూపు పేరుతో ఏర్పాటైన మద్యం సిండికేట్లలో శరత్ చంద్రారెడ్డి అతిపెద్ద భాగస్వామి గా ఉన్నారని ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముప్పై శాతం బిజినెస్ ఆయనదేనని పేర్కొంది.

మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేయడం కోసం డిజిటల్ సర్వర్లలో ఉన్న సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు కూడా ప్రయత్నించినట్టు ఈడీ తన రిపోర్టులో పేర్కొంది. ట్రైడెంట్ చాంపర్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్, ఆర్గనోమిక్స్ ఎకో సిస్టమ్స్ అనే సంస్థ ద్వారా శరత్ చంద్రారెడ్డి నేరుగా కార్యకలాపాలు జరిపినట్టు పేర్కొన్న ఈడీ ఆయనను కీలక నిందితుడిగా రిపోర్ట్ లో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+