హైకోర్టులో భూపతి, యాదవరెడ్డి ఊరట : మండలి ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయొద్దని ఈసీకి ఆదేశం
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు భూపతిరెడ్డి, యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మండలి చైర్మన్ వారిపై అనర్హత వేటు వేశారు. ఈ ఖాళీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోన్న వేళ భూపతి, యాదవరెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు .. ఎన్నికల నిర్వహణకు ఈ నెల 15 వరకు నోటిఫికేషన్ జారీచేయొద్దని స్పష్టంచేసింది.

ఫిరాయింపులపై చర్యలు
నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి భూపతిరెడ్డి, ఎమ్మెల్యే కోటాలో యాదవరెడ్డి విజయం సాధించారు. వీరిద్దరూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని .. వీరితోపాటు రాములునాయక్‌పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మండలి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై అనర్హత వేటు వేస్తు చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు.
హైకోర్టులో పిటిషన్
సభ్యత్వం రద్దును సవాల్ చేస్తూ భూపతి, యాదవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదన వినకుండ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా మండలి నిర్ణయం తీసుకుందని వారి తరఫున న్యాయవాది వాదించారు. కాంగ్రెస్ పార్టీలో చేరామనేందుకు ఎలాంటి ఆధారం లేదని, అయినా తమపై ఏకపక్షంగా అనర్హత వేటు వేశారని ఆరోపించారు. వీరి వాదనుల విన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేయొద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదావేసింది. దీంతోపాటు ఎన్నికల సభ్యత్వం రద్దుకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని మండలిని హైకోర్టు కోరింది.












Click it and Unblock the Notifications