
కాంగ్రెస్ అంటే ఫ్లవర్ అనుకున్నారా.. ఫైర్; ఉక్రెయిన్ సైన్యంలా... రేణుకా చౌదరి సంచలనం
కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది కాలంగా మౌనంగా ఉంటున్న ఆమె మళ్లీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సమయం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నివురుగప్పిన నిప్పులా తాను కాచుకుని ఉన్నానని పేర్కొన్న రేణుకాచౌదరి తాను ఎక్కడికి పోలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్లవర్ అనుకున్నారా... ఫైర్ అంటూ పుష్ప సినిమాలోని డైలాగ్ కొట్టారు.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట: రేణుకా చౌదరి
గ్రూప్
రాజకీయాలు
వద్దు
అనే
తాను
సైలెంట్
గా
ఉంటున్నాను
అని
పేర్కొన్న
రేణుకా
చౌదరి,
నా
కంటే
బెటర్
గా
పని
చేస్తారని
వెయిట్
చేశానని
వ్యాఖ్యానించారు.
గెలుపు
కోసం
జిల్లాలు
మార్చే
నేతలు
ఉన్నారని
మాట్లాడిన
రేణుకా
చౌదరి,
గెలిచినా,
ఓడినా
తాను
ఖమ్మం
ఆడబిడ్డ
గానే
ఉంటానని
స్పష్టం
చేశారు.
తనకు
పదవులు
ముఖ్యం
కాదని
పేర్కొన్న
రేణుకాచౌదరి,
కార్యకర్తల
అభిప్రాయానికి
అనుగుణంగా
నడుచుకుంటా
అంటూ
వ్యాఖ్యలు
చేశారు.
ఖమ్మం
జిల్లా
కాంగ్రెస్
పార్టీకి
కంచుకోటని
పేర్కొన్న
రేణుకా
చౌదరి
కాంగ్రెస్
కార్యకర్తల
పార్టీ
అని,
తనకు
రాజకీయ
వారసులు
లేరు
అంటూ
వ్యాఖ్యానించారు.

పువ్వాడకు తాను భయపడేది లేదన్న మాజీ కేంద్ర మంత్రి
తిరుగుబాటు
వచ్చేది
ఖమ్మం
నుంచి
అని
పేర్కొన్న
ఆమె
ఎవరికి
భయపడవలసిన
అవసరం
లేదని
వెల్లడించారు.
పువ్వాడ
అజయ్
కాదు
ఆయన
బాబు
కూడా
తనకు
తెలుసని
పేర్కొన్న
రేణుకాచౌదరి
వాళ్ళెవరికీ
తాను
భయపడను
అంటూ
వ్యాఖ్యలు
చేశారు.
కాంగ్రెస్
అంటే
సామాన్యం
కాదని
కాంగ్రెస్
అంటే
ఫైర్
అని
రేణుకాచౌదరి
పేర్కొన్నారు.
కాంగ్రెస్
పార్టీని
కాపాడుకోవాల్సిన
బాధ్యత
అందరిపైనా
ఉందన్న
రేణుకా
చౌదరి,
ఉక్రెయిన్
సైనికుల్లాగా
కాంగ్రెస్
కార్యకర్తలు
పోరాటం
చేయాలని
ఆసక్తికర
వ్యాఖ్యలు
చేశారు.

మరో స్వతంత్ర్య పోరాటం చెయ్యాల్సిన అవసరం ఉంది: రేణుకా చౌదరి
ప్రధాని
నరేంద్ర
మోడీ
కేవలం
మాటలు
చెప్తారని,
కానీ
కాంగ్రెస్
పార్టీ
దేశాన్ని
అభివృద్ధి
చేసి
చూపించిందని
రేణుకా
చౌదరి
వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి,
దేశానికి
పట్టిన
దరిద్రం
వదిలించుకోవాలని
పేర్కొన్న
రేణుకా
చౌదరి
కాంగ్రెస్
పార్టీ
కార్యకర్తలు
మరో
స్వతంత్ర్య
సంగ్రామం
కోసం
పోరాటం
చేయాల్సిన
అవసరం
ఉందని
వెల్లడించారు.
ఐదు
రాష్ట్రాల
ఎన్నికల
ఫలితాల
తర్వాత
కాంగ్రెస్
శ్రేణుల్లో
నిరుత్సాహం
వచ్చిందన్న
ఆమె,
నిరుత్సాహ
పడాల్సిన
అవసరం
లేదని
కార్యకర్తలకు
దిశానిర్దేశం
చేశారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగల్లా తయారయ్యాయి
కేంద్ర,
రాష్ట్ర
ప్రభుత్వాలు
జేబు
దొంగల
మాదిరిగా
తయారయ్యాయని
మండిపడిన
రేణుకా
చౌదరి
మళ్లీ
కాంగ్రెస్
పార్టీకి
పట్టం
కట్టడం
కోసం
కార్యకర్తలు
రంగంలోకి
దిగాలి
అన్నారు.
తెలంగాణ
రాష్ట్రంలో
ఉన్నది
ఇందిరమ్మ
ఇళ్లు
మాత్రమే
అని
పేర్కొన్న
రేణుకా
చౌదరి
కేసీఆర్
డబుల్
బెడ్
రూమ్
ఇల్లు
ఎక్కడా
లేవని,
ఉన్నా
అవి
నాసిరకపు
ఇళ్లని
పేర్కొన్నారు.
ప్రస్తుతం
టీఆర్ఎస్
ప్రభుత్వం
ఏ
విధమైన
అభివృద్ధి
చెయ్యలేదని
రేణుకా
చౌదరి
విమర్శించారు.
కేంద్రంలో
బీజేపీణీ,
రాష్ట్రంలో
టీఆర్ఎస్
ను
గద్దె
దింపాలని
రేణుకా
చౌదరి
వ్యాఖ్యానించారు.