పార్టీ మార్పుపై రేణుకా చౌదరి: టీఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం
హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి స్పందించారు. గురువారం రైతు సమస్యలపై ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు రావడం లేదని తనపై దుష్ప్రచారం ఆమె మండిపడ్డారు. నకిలీ విత్తనాలతో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని రైతులు బాగా నష్టపోయారని పేర్కొన్నారు. నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోకుండా వారిని కాపాడటంలో ఆంతర్యమేమిటని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆమె విమర్శించారు.












Click it and Unblock the Notifications