వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Republic day 2023: ఆర్ఆర్ఆర్ సినిమాకు వారిద్దరికీ పురస్కారాలు అందించిన గవర్నర్ తమిళిసై!!

గణతంత్ర వేడుకల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ కు స్థానం దక్కింది. తెలంగాణా గవర్నర్ తమిళిసై, సినీ గేయం నాటు నాటు సినిమాకు వారిద్దరికీ పురస్కారాలను అందించి సత్కరించారు.

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజ్ భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో జరిగిన ఆధికారిక వేడుకల్లో గవర్నర్ డాక్టర్ . తమిళి సై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు.

సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, రాజ్యాంగ మౌలిక విలువల పరిపుష్టికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అమలును గవర్నర్ ప్రస్తావించారు.

రిపబ్లిక్ డే వేడుకల్లో సంగీత, సాహిత్య సామాజిక సేవా రంగాల్లో ఆరుగురికి పురస్కారాలు

రిపబ్లిక్ డే వేడుకల్లో సంగీత, సాహిత్య సామాజిక సేవా రంగాల్లో ఆరుగురికి పురస్కారాలు


రిపబ్లిక్ డే వేడుకలు సందర్భంగా సంగీత, సాహిత్య సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసిన ఆరుగురికి గవర్నర్ ఈ సందర్భంగా పురస్కారాలు అందజేశారు.ఇటీవల్ గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకున్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినీ గేయం నాటు నాటు సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి, గీత రచయిత కే సుభాష్ చంద్రబోస్ లను గవర్నర్ తమిళి సై సత్కరించారు.

సామాజిక నాయకత్వ విభాగంలో భగవాన్ మహావీర్ , వికలాంగ సహాయత సమితి ప్రతినిధి, విద్యా - యువత సాధికారత లో ఎం బాల లతా, పర అథ్లెట్ కే . లోకేశ్వరీ, క్రీడా రంగంలో శ్రీజఆకుల పురస్కారాలు అందుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు పాటకు కీరవాణి, చంద్ర బోస్ లకు గవర్నర్ పురస్కారం

ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు పాటకు కీరవాణి, చంద్ర బోస్ లకు గవర్నర్ పురస్కారం


ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటడంతో పాటు వివిధ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ పాట కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ పాట ఆస్కార్ నామినేషన్స్ కు సైతం ఎంపికైంది. దీంతో ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సత్కరించారు. వారికి రిపబ్లిక్ డే సందర్భంగా పురస్కారం అందజేశారు .

తెలుగులోనూ మాట్లాడిన గవర్నర్ .. పెరేడ్ గ్రౌండ్స్ వద్ద అమరులకు నివాళి

తెలుగులోనూ మాట్లాడిన గవర్నర్ .. పెరేడ్ గ్రౌండ్స్ వద్ద అమరులకు నివాళి


రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు, ఇంగ్లీషులో దాదాపు అరగంటపాటు సాగిన ప్రసంగంలో గవర్నర్ పలుసార్లు తెలుగులో కూడా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్ పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అంతకు ముందు, గవర్నర్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వద్ద అమరవీరుల సైనిక్ స్మారక్ వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు.

English summary
Governor Tamilisai, who gave awards to the RRR team, music director MM Keeravani and lyricist K Chandra Bose were honored in the Republic celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X