• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సింగరేణిపై సీఎం కేసీఆర్ సంచలనం -కార్మికుల రిటైర్మెంట్ వయసు 61కి పెంపు -ఎన్నికల్లో కవిత vs సీతక్క?

|

తెలంగాణలో అతి కీలకమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి బొగ్గు బావులతోపాటు సంస్థలో పనిచేసే అందరు కార్మికుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని సీఎం నిర్ణయించారు. త్వరలోనే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాల్సి ఉండగా అధికార టీఆర్ఎస్ అధినేత కార్మికులపై ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

 రేవంత్ రెడ్డి దెబ్బ: తొలిసారి కేసీఆర్ డిఫెన్స్? -భూముల వేలంపై సర్కారు వివరణ -పరువునష్టం హెచ్చరిక రేవంత్ రెడ్డి దెబ్బ: తొలిసారి కేసీఆర్ డిఫెన్స్? -భూముల వేలంపై సర్కారు వివరణ -పరువునష్టం హెచ్చరిక

26న పెంపు తేదీల ప్రకటన..

26న పెంపు తేదీల ప్రకటన..

సింగరేణి సంస్థలో కార్మికుల రిటైర్మెంట్ వయసును 61కి పెంచాలన్న సీఎం కేసీఆర్.. ఈ మేరకు ఈనెల 26న జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు కార్మికుల పదవీ విరమణ వయసు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది. అంతేకాదు,

Telangana: భూముల విలువ పెంపు -ఎకరా రూ.75వేలు -చార్జీల బాదుడు -కేసీఆర్ సర్కారు ఉత్తర్వులుTelangana: భూముల విలువ పెంపు -ఎకరా రూ.75వేలు -చార్జీల బాదుడు -కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు

రామగుండంలో మెడికల్ కాలేజ్

రామగుండంలో మెడికల్ కాలేజ్

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు పెంపుతోపాటే కోల్ బెల్టుకు సంబంధించి సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని కూడా సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కార అంశాలపై కోల్ బెల్ట్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో ప్రగతి భవన్‌లో మంగళవారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ వెంటనే రిటైర్మెంట్ పెంపు, మెడికల్ కాలేజీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే,

  Congress MLA Sridhar Babu Fired On Minister Koppula Eshwar About Singareni || Oneindia Telugu
  సింరేణి ఎన్నికల్లో కవిత vs సీతక్క

  సింరేణి ఎన్నికల్లో కవిత vs సీతక్క

  వారసత్వ ఉద్యోగాలకు సుప్రీంకోర్టు నో చెప్పిన దరిమిలా సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అసంపూర్తిగానే మిగిలిన నేపథ్యంలో, రిటైర్మెంట్ వయసు పెంచుతూ తాజాగా తీసుకున్న నిర్ణయం కార్మికుల్ని మెప్పిస్తుందని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదీగాక, దాదాపు ఎడాదికిపైగా పెండింగ్ లో ఉన్న గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరలో జరగొచ్చనే వార్తల నడుమ కేసీఆర్ నిర్ణయాలు కీలకంగా మారాయి. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కర్మిక సంఘం గెలుపు కోసం ఆ సంస్థ గౌరవ అధ్యక్షురాలైన ఎమ్మెల్సీ కవిత వ్యూహాలకు పదునుపెడుతుండగా, కాంగ్రెస్ తన అనుబంధ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసీ)తరఫున ఎమ్మెల్యే సీతక్కను బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల ప్రకటన వస్తే సింగరేణి రాజకీయం కవిత వర్సెస్ సీతక్కలా మారేలా కనిపిస్తోంది.

  English summary
  Telangana Chief Minister K Chandrashekhar Rao on Tuesday took decision to enhance Singareni workers superannuation age to 61 years. He directed Singareni Collieries Company Limited (SCCL) chairman and managing director N Sridhar to announce the date of implementation at the board meeting to be held on July 26. TBGKS and MLAs from the coal belt area met cm kcr. trade union elections in singareni likely tobe soon.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X