రేవంత్‌కు మళ్లీ షాక్: 'ఆ వాయిస్ రిపోర్ట్ రావాలి, దర్యాఫ్తు కాలేదు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. ఆయనకు బెయిల్ ఇవ్వవద్దన్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వాదనతో న్యాయస్థానం సోమవారం ఏకీభవించింది.
దీంతో, రేవంత్ రెడ్డితో పాటు మిగతా నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలకు న్యాయస్థానం ఈ నెల 29వ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండును పొడిగించింది.

ఏసీబీ సోమవారం కోర్టులో మెమో దాఖలు చేసింది. ఓటుకు నోటు వ్యవహారంలో ఇంకా దర్యాఫ్తు పూర్తి కాలేదని చెప్పింది. రేవంత్ రెడ్డి సహా ఎవరికీ బెయిల్ ఇవ్వవద్దని సూచించింది. ఇంకా సాక్ష్యులను విచారించవలసి ఉందని పేర్కొంది. ఫోరెన్సిక్ లేబోరేటరీ నుండి వాయిస్ రికార్డులు రావాల్సి ఉందని తెలిపింది.
దీంతో ఏసీబీ న్యాయస్థానం వారి రిమాండును పొడిగించింది. కాగా, నిందితుల రిమాండు పొడిగించడంతో ఉదయ్ సిన్హా, సెబాస్టియన్లను ఓ వాహనంలో, రేవంత్ రెడ్డిని మరో వాహనంలో చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
కోర్టులో మెమో దాఖలు చేసింది, ఇంకా పూర్తి కాలేదు, బెయిల్ వద్దు, ఇంకా సాక్ష్యులను విచారించాలి, రిమాండ్ పొడిగింపు 29 వరకు, దర్యాఫ్తూ పూర్తి కాలేదు, నివేదిక రావాలి,












Click it and Unblock the Notifications