రేషన్ కార్డు లేనివారికీ ఆరోగ్యశ్రీ.. రేవంత్ క్యాబినెట్ కీలక నిర్ణయం!!
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు అందించే ఉచిత వైద్యం పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలకు చేసింది.
ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవడం వల్ల చాలామంది ఈ పథకానికి దూరం అవుతున్నారని గుర్తించిన రేవంత్ సర్కార్ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.

అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని నివేదికను తమకు అందజేయాలని రేవంత్ సర్కార్ అధికారులను ఆదేశించింది .తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలంగా రేషన్ కార్డులు జారీ కాకపోవడం అనేకమంది పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడం, కుటుంబాలు విడిపోవడం అంటే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు ఫ్రీగా అందే లక్షల విలువైన వైద్యం రేషన్ కార్డుల వల్ల అందకుండా పోతుందని పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి నష్టపోతున్నారని గుర్తించింది.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తాజాగా ఈ కీలక నిర్ణయాన్ని తీసుకొని రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి నివేదిక అందించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న భేటీ అయిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకోగా అందులో ముఖ్యమైనది ఇది. దీంతో పాటు అర్హులైన వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అంతేకాదు మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో బ్రాండింగ్ కల్పించాలని కూడా తీర్మానించింది. 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైమ్ స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలనే కీలక నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది. అంతే కాదు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడతగా నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేయడం కోసం 22,500 కోట్ల రూపాయలను కేటాయించాలని మంత్రివర్గం తీర్మానం చేసింది.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఇచ్చిన స్థలానికి సంబంధించిన లీజును మరో 30 ఏళ్ల పాటు పొడిగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో రెండు మూడు రోజుల్లో 93% వరకు రైతు భరోసా పంపిణీ చేయాలని రేవంత్ మంత్రివర్గం నిర్ణయించింది.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications