వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌ను దించే సీన్ రేవంత్‌కు లేదు.. బీజేపీకి మద్దతు ఇవ్వాలి: తీన్మార్ మల్లన్న సంచలనం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు రోజు రోజుకు మ‌రింత హీటెక్కుతున్నాయి. అధికార, విప‌క్షాల మ‌ధ్య మాట యుద్ధం న‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే తాజాగా బీజేపీ నేత తీన్మార్ మ‌ల్ల‌న్న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీని గ‌ద్దే దించే స‌త్తా కాంగ్రెస్‌కు లేద‌న్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తే బాగుంటుంద‌ని ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్యూలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

 రేవంత్ రెడ్డి బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తే బాగుంటుంది..

రేవంత్ రెడ్డి బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తే బాగుంటుంది..

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌ను దించే స‌త్తా టీ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు లేద‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు.. కానీ గ్రూపు రాజ‌కీయాలే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద‌ మైన‌స్ అని చెప్పుకొచ్చారు. ప్ర‌జ‌ల‌కు స‌రైన హామీ ఇచ్చే ప‌రిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలో లేద‌ని విమ‌ర్శించారు. అధికార టీఆర్ఎస్ పై రేవంత్ చేస్తున్న పోరాటంలో త‌ప్ప ప‌ట్టాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌న్నారు. తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని కొట్ట‌గ‌లిగే స‌త్తా ఒక్క బీజేపీకే ఉంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు మ‌ల్ల‌న్న‌. రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుకుని బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తే బాగుటుంద‌ని పేర్కొన్నారు.

తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు

తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ పాల‌నకు ప్ర‌జ‌లు విసిగిపోయార‌న్నారు మ‌ల్ల‌న్న‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీదే గెలుపు అని ధీమా వ్య‌క్తం చేశారు. నిజాయితీతో కొట్లాడే నాయ‌కులు బీజేపీలో ఉన్నార‌ని పేర్కొన్నారు. కేసీఆర్ చేసేవ‌న్నీ డ్రామాల‌న్ని ప్ర‌జ‌లు తెలిసిపోయాయ‌ని విమ‌ర్శించారు. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌లు చూడ‌లేద‌ని ఇప్పుడు బీజేపీకి ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. క‌మ‌లంను అధికారంలోకి తీసుకొచ్చేలా ప్ర‌తి కార్య‌క‌ర్త క‌సితో ప‌నిచేస్తున్నార‌ని మ‌ల‌న్న పేర్కొన్నారు.

తొలి సంత‌కం విద్య‌-వైద్యంపైనే..

తొలి సంత‌కం విద్య‌-వైద్యంపైనే..


తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రాగానే తొలి సంత‌కం విద్య‌-వైద్యంపైనే అని తీన్మార్ మ‌ల్ల‌న్న‌ పేర్కొన్నారు . ఈ మేర‌కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడి బండి సంజ‌య్ కూడా హామీ ఇచ్చిన‌ట్లు గుర్తు చేశారు. ప్ర‌తి పేద‌వాడికి కార్పొరేట్ ఆస్ప‌త్రిలో ఉచితంగా వైద్యం, కాలేజీల్లో విద్య అందేలా చూడ‌డ‌మే త‌మ లక్ష్య‌మ‌ని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాల‌న‌లో ఆరోగ్య శ్రీకే రోగం వ‌చ్చే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు స‌రైన వైద్యం కూడా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అందించ‌డంలేద‌ని మ‌ల్ల‌న్న విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి కూడా ఇవ్వ‌డం లేద‌ని మండిపడ్డారు. 50వేల ఉద్యోగాలు అని కేసీఆర్ చెప్పి నేటికి స‌రిగ్గా ఏడాది గ‌డిసిందని దానిపై ఇంత వ‌ర‌కు నోటిఫికేష‌న్ కూడా లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అందుకే బీజేపీలో చేరా..

అందుకే బీజేపీలో చేరా..

తాను భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌ముంద‌న్నారు తీన్మార్ మ‌ల‌న్న. ద‌ళితుడిని ముఖ్య‌మంత్రి చేస్తాన‌ని చెప్పి కేసీఆర్ మోసం చేశాడని ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. ఒక ద‌ళిత బిడ్డ‌గా త‌నను బీజేపీలో చేర్పించేందుకు త‌న భార్య ఆ పార్టీ ఆగ్ర‌నేత‌ల‌కు హామీ ఇచ్చింద‌న్నారు. రాష్ట్ర సంప‌ద‌ను క‌ల్వ‌కుంట వారి కుటుంబం దోచుకుంటుంద‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. కేసీఆర్ దోపిడీ పాల‌న నుంచి రాష్ట్రాన్ని ర‌క్షించేందుకు బీజేపీలో చేరిన‌ట్లు మ‌ల్ల‌న్న చెప్పారు. బీజేపీలో చేరితే కేసులు పోతాయ‌ని చేర‌లేదన్నారు.. బీజేపీకి మాత్ర‌మే కేసీఆర్‌ను గద్దె దించే స‌త్తా ఉంద‌ని వ్యాఖ్యానించారు..

కేసుల‌తో ఉక్కిరి బిక్కిరి..

కేసుల‌తో ఉక్కిరి బిక్కిరి..

సీఎం కేసీఆర్‌కి విధాన్నాల్లేవ్‌... సిద్ధాంతాలు అస‌ల్లేవ్ అని మండిప‌డ్డారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాటమాడుతున్నార‌ని మ‌ల్ల‌న్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసుల‌తో త‌న‌ను ఉక్కిరి బిక్కిరి చేసినా వెన‌క్కి త‌గ్గేది లేద‌న‌న్నారు. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్రిస్తూనే ఉంటాన‌ని హెచ్చ‌రించారు. 34 కేసులు కేసు పెట్టి 73 రోజులు జెల్లో పెట్టార‌ని మండిప‌డ్డారు.

సీత‌క్క అంటే గౌర‌వం

సీత‌క్క అంటే గౌర‌వం

ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే ఏ నాయ‌కుడినైనా అభిమానిస్తాన‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న‌ అన్నారు. త‌న‌కు అన్ని పార్టీల‌లో మిత్రులు ఉన్నార‌ని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని జ‌ర్న‌లిస్టుగానే గ‌తంలో క‌లిశాన‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క అంటే త‌న‌కు ఎన‌లేని అభిమానం, గౌర‌వ‌మ‌ని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలోని నేత‌లు స‌హితం త‌న‌కు మంచి మిత్రులు ఉన్నారని చెప్పారు. ప్ర‌జ‌ల ప‌క్షాళ‌న ప్ర‌శ్నిస్తూనే ఉంటా అని మ‌ల్ల‌న్న స్ప‌ష్టం చేశారు. త‌న‌కు వ్య‌క్తి గ‌త ఇమేజ్ త‌న‌కు అవ‌స‌రం లేదన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిచి ఉంటే ఈ ఆర‌చాక పాల‌న‌ను ఆడుకునే వాడినంటూ మండిప‌డ్డారు మ‌ల‌న్న‌. తాను బీజేపీలో చేరినా కాన్షీరామ్‌ ఆద‌ర్శాల‌తో ప‌నిచేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు

English summary
The Congress does not have the power to bring down Telangana CM KCR - Teenmar Mallanna Sensational comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X