Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏ జిల్లా నుంచి ఎవరు మంత్రి - ఏ వర్గానికి ఎన్ని పదవులు..!!

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రేవంత్ తో పాటుగా 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాబోతున్న మంత్రులకు రేవంత్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ నుంచి ఒక డిప్యూటీ సీఎం..మరో ఇద్దరు మంత్రులుగా ఖరారు చేసారు. భట్టికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఖాయం అయింది. ఇక, తాజా మంత్రివర్గ జాబితాలో ఆసక్తి కర సమీకరణాలు కనిపిస్తున్నాయి.

కొత్త సమీకరణాలు
తెలంగాణ కొత్త కేబినెట్ లో సామాజిక - ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రేవంత్ కేబినెట్ లో జిల్లాలతో పాటుగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత కనిపిస్తోంది. ఇప్పటికే ఈ రోజు రేవంత్ తో పాటుగా ప్రమాణం చేసే 11 మంది జాబితా రాజ్ భవన్ కు చేరింది. ప్రధానంగా ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ సీపీఐతో సహా 9 స్థానాలు గెలిచింది.

Revanth gives priority for Social Equations and Seniority in Cabinet, list is here

దీంతో, ఈ జిల్లా నుంచి భట్టికి డిప్యూటీ సీఎం..తుమ్మల, పొంగులేటికి మంత్రి పదవులు ఖరారయ్యాయి. అదే విధంగా నల్గొండ జిల్లాలోనూ ఒక్క స్థానం మాత్రమే కాంగ్రెస్ కోల్పోయింది. అక్కడి నుంచి సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డి మంత్రి పదవులు దక్కాయి. వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మహిళలు సీతక్క, కొండా సురేఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఏ జిల్లా నుంచి ఎవరు
ఇక, సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి మాజీ మంత్రి జూపల్లి క్రిష్టారావు కు మంత్రి పదవి ఖాయమైంది. మెదక్ నుంచి దామోదర్ రాజనర్సింహ కు స్థానం ఖరారైంది. కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీంతో..ఎస్సీ వర్గం నుంచి ఇద్దరు, రెడ్డి వర్గం నుంచి ముగ్గురు(రేవంత్ కాకుండా), బీసీ వర్గం నుంచి ఇద్దరు (ఒక మహిళ) ఎస్టీ వర్గం నుంచి ఒకరు కమ్మ వర్గం నుంచి ఒకరు, బ్రాహ్మణ వర్గం నుంచి ఒకరు, వెలమ వర్గానికి చెందిన జూపల్లికి తొలి మంత్రివర్గంలోనే స్థానం కల్పించారు. అదిలాబాద్ నుంచి ప్రస్తుతానికి ప్రాధాన్యత దక్కలేదు. అక్కడ నుంచి ప్రేమ్ సాగర్ రావు ప్రయత్నం చేసినా వెలమ వర్గం నుంచి జూపల్లికి ఖాయం కావటంతో ఆయనకు అవకాశం ఇవ్వలేదు.

12 మంది ప్రమాణ స్వీకారం
ఇక..మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ పేరు వినిపిస్తున్నా..ఆయన తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఎమ్మెల్సీ చేసి విస్తరణలో భాగంగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అదే విధంగా గడ్డం బ్రదర్స్ లో వినోద్ పేరు ప్రముఖంగా రేసులో ఉంది. కానీ, ఈ జాబితాలో లేదు. దీని ద్వారా సామాజికంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసారు.

ఇప్పుడు రేవంత్ సీఎం కావటంతో పీసీసీ చీఫ్, స్పీకర్ పదవి విషయంలోనూ సామాజిక వర్గాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి మాత్రమే ముగ్గురికి అవకాశం దక్కింది. ఇక, ఈ ప్రమాణ స్వీకారం తరువాత పార్టీలో వచ్చే స్పందనలు పరిశీలించి..మిగిలిన వర్గాలు - ప్రాంతాలకు విస్తరణలో అవకాశం కల్పించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+