కేసీఆర్ పథకాలకు బిగుస్తున్న ఉచ్చు.. విచారణ దిశగా రేవంత్ ప్రభుత్వం!!
అసెంబ్లీలో హారీష్ రావు వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో హరీష్ రావు గత పాలన బ్రహ్మాండంగా సాగిందని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు అడుగడుగునా మోసపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాని టార్గెట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైనా, ప్రభుత్వ భూములను అమ్మాలన్న కాంగ్రెస్ ఆలోచనలపైన టార్గెట్ చేశారు. దీంతో కేసీఆర్ పథకాల అవినీతిని తూర్పారబట్టిన రేవంత్ వదిలిపెట్టమని హింట్ ఇచ్చారు.
ప్రజలు శిక్షించినా వాళ్ళు మారలేదు : రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలతో హరీష్ రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరని, ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదని అసహనం వ్యక్తంచేశారు. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ.7వేల కోట్లకే తెగనమ్మారని ఆరోపించారు. గొర్రెల స్కీం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని నిప్పులు చెరిగారు.

అన్నిటిలో అవినీతే
గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారన్నారు.ఆడబిడ్డల సెంటిమెంట్ నూ దోపిడీకి ఉపయోగించుకున్నారని మండిపడ్డారు.కురుమ, యాదవుల సోదరులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారన్నారు.కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి...ఇప్పుడు రూ.94వేల కోట్లు అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు అమ్మిన భూముల లెక్క తీద్దాం
మీరు ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మారో లెక్క తీద్దాం అని సవాల్ విసిరారు. అప్పుల లెక్కలు చెబుతున్నారు... కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పటం లేదన్నారు. పదేళ్లయినా పాలమూరుకు చేసిందేం లేదని, 20లక్షల కోట్లకు పైగా ఖర్చుపెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం వీళ్లు కాదా? అంటూ నిప్పులు చెరిగారు.
రంగారెడ్డి ఎడారైంది మీ వలన కాదా
రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారన్న రేవంత్ రెడ్డి గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా... రంగారెడ్డి జిల్లాపై నిర్లక్ష్యం వహించారని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆస్తులు అమ్ముకున్నారు కానీ జిల్లాకు సాగు నీరు ఇవ్వలేదన్నారు. ప్రజలు బీఆరెస్ కు గుండుసున్నా ఇచ్చినా బుద్ధి మారకుండా ఇలా మాట్లాడటం సరైంది కాదని ఎద్దేవా చేశారు.
వాటిపై విచారణకు సిద్ధమా?
మీరు నిజాయితీ పాలన అందించి ఉంటే... బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీ పై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ ఒప్పందాల్లో లెక్కలు బయట పెడతామని, సభలో పెట్టి అన్ని లెక్కలు అడుగుతామని, కడుగుతామని రేవంత్ రెడ్డి హరీష్ రావు కు కౌంటర్ ఇచ్చారు. ఇక తాజాగా అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ పథకాలకు ఉచ్చు బిగుస్తుందని అర్ధం అవుతుంది. రేవంత్ విచారణ చేయించే ఆలోచనలో ఉన్నారన్నది ఆయన మాటల్లోనే అర్ధం అవుతుంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications