రైతుభరోసా పండుగ షురూ.. 9రోజుల్లో రేవంత్ టార్గెట్ అదే!
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు రైతు భరోసా అందించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. క్యాబినెట్ భేటీ నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కా రైతు భరోసా నిధుల పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టింది. వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభించినది.
తొలి రోజు రెండు ఎకరాల రైతుల ఖాతాల్లో నగదు జమ
ఒక్కరోజే తొలి రోజు రెండు ఎకరాల వరకు ఉన్న రైతులు అందరి బ్యాంకు ఖాతాలలోకి ఎకరానికి ఆరువేల రూపాయలు చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 41.25 లక్షల మంది రైతులకు సంబంధించి 39.16 లక్షల ఎకరాలకు 2349.83కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినట్టు తెలిపారు.

తొమ్మిది రోజుల్లో రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా
మిగిలిన వారికి కూడా వచ్చే తొమ్మిది రోజుల్లో నిధులు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అయితే ఎన్ని ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తున్నారు అన్న దానిపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వలేదు . తొలి రోజున ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు 812.6కోట్ల రూపాయలు, రెండు ఎకరాల వరకు భూమి ఉన్నవారికి 1537.2కోట్ల రూపాయలు చెల్లించారు.
9 రోజుల్లో 9వేల కోట్ల రూపాయలు.. రేవంత్ సర్కార్ రైతు భరోసా
రాష్ట్ర ప్రభుత్వం తరఫున రానున్న తొమ్మిది రోజులలో మొత్తం రాష్ట్రంలో 70 లక్షల 11వేల 184 మంది రైతులకు 1.49 కోట్ల ఎకరాలకు 9వేల కోట్ల రూపాయలు జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తున్నారు. ఈ చర్యతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు..ప్రస్తుతం రైతుల ఖాతాలలో జమ చేస్తున్న నిధులు రైతులకు పంట సాగుకు కావలసిన పెట్టుబడి సాయంగా ఉపయోగపడతాయని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications