తెలంగాణాలో పెన్షన్ దారులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని పెన్షన్ దారులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, హెచ్ఐవి బాధితులు, నేతన్నలు నెలవారి పెన్షన్ ను అందుకుంటున్నారు. అయితే గత ఐదు సంవత్సరాలలో 2.24 లక్షల మంది పెన్షన్ దారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్టు సెర్ప్ గుర్తించింది.
పెన్షన్ విషయంలో వాళ్లకు ఊరట
ఇక వలస వెళ్లిన వారు వరుసగా మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోవడంతో వారి పేర్లను పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుండి తొలగించింది. అయితే ఎవరైతే తిరిగి తమ సొంత ఊరికి వచ్చి ఉంటారో మళ్ళీ వాళ్లకు పెన్షన్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక ఇది వలస వెళ్లడం వల్ల పెన్షన్ కోల్పోయిన వారికి కాస్త ఊరట కలిగిస్తుంది.

వారికి పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వ నిర్ణయం
చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోవడంతో లబ్ధిదారుల జాబితా నుంచి తమ పేరు తొలగించారని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పెన్షన్ కోసం పడరాని పాట్లు పడుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ మేరకు వీరి ఇబ్బందిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ వీరికి మే 1వ తేదీ నుంచి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో లబ్దిదారుల హర్షం
రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు 4016 రూపాయలు, ఇతర లబ్దిదారులకు 2016 రూపాయలు పెన్షన్ అందుతుంది. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. అయితే లబ్ధిదారులు ఎవరైతే మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోలేదో వారి పెన్షన్ను నిలుపుదల చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో కాస్త ఆందోళన పడ్డారు. ఇక ఇప్పుడు మళ్లీ వారి పెన్షన్ వారికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మే నెలలో వీరికి పెన్షన్
రాష్ట్రంలో ఉన్న బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక స్థిరత్వాన్ని, వృద్ధులు, వికలాంగులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించడం కోసం తీసుకువచ్చిన ఈ పెన్షన్ విధానం రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వృద్ధుల, వికలాంగుల జీవితానికి బాసటనిస్తోంది. అటువంటి పెన్షన్ పథకంలో లబ్ధిని కోల్పోయిన వారు తిరిగి తమకు ప్రయోజనం చేకూరాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకుంటే మే నెలలో పెన్షన్ పొందే వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications