Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త మంత్రులు, ముహూర్తం ఖరారు - సీతక్కకు హోం..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలు వు తీరి 17 నెలలు పూర్తవుతోంది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కొత్త మంత్రులను ఖరారు చేసారు. విస్తరణ ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరిని తప్పించాలనే ప్రతిపాదన వచ్చినా..తుది నిర్ణయం జరగలేదు. కాగా, ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు ఖాయమయ్యాయి. కీలకమైన హోం శాఖ విషయంలో నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ముహూర్తం ఖరారు
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కు పార్టీ అధినాయకత్వం ఆమోదం తెలిపింది. ఉగాది రోజున లేదా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. మంత్రుల తుది కూర్పు ఖాయమైంది. పార్టీలో పదవులు రాని వారికి ముందస్తు బుజ్జగింపుల తరువాత విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా, ఈ రోజు .. రేపు అసెంబ్లీ వేదికగా అధికార పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఆరు స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉన్నా, ఒక స్థానం ఖాళీ ఉంచాలని నిర్ణయించారు. అయిదుగురిని సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసారు. మైనార్టీ కోటాలో హైదరాబాద్ నుంచే ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే అంశం పైన ప్రస్తుతం చర్చ సాగుతోంది.

Revanth led Cabinet expansion is likely to take place on April 3

కొత్త మంత్రులుగా
ఉగాది వరకు మంచి రోజులు లేవని, ఈ నేపథ్యంలో ఉగాది రోజు కొత్త మంత్రులు ప్రమాణం చేయ నున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఖరారు అయినట్లుగా చెబుతున్న వారిలో రెండు రెడ్డి, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక మైనార్టీకి అవకాశం దక్కనుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నా రు. నల్గొండ నుంచి ఇద్దరు రెడ్డి వర్గానికి చెందిన వారే మంత్రులుగా ఉండటంతో రాజగోపాల్ రెడ్డికి అవకాశం పైన తుది వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. దీంతో, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తమ వంతు ప్రయత్నాలు చేసుకున్నారు. వీరిలో ఒకరికి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పదవి దక్కనున్నట్లు చెబుతున్నారు.

రేవంత్ ఫార్ములా
ఎస్సీకి సంబంధించి మాల సామాజికవర్గానికి చెందిన గడ్డం వివేక్‌ వెంకటస్వామి పేరే దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. బీసీల నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరి పేరు ఖరారైనట్లయినట్లు సమాచారం. మున్నూరు కాపు వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తే ఆది శ్రీనివాస్ కు ఛాన్స్ దక్కనుంది. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్గంలోకి తీసుకో వడానికి ఎమ్మెల్సీ ఆమెర్‌ అలీఖాన్‌ ఒక్కరే చట్టసభల్లో అందుబాటులో ఉన్నారు. కొత్త మంత్రుల రాకతో శాఖల మార్పు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ముగ్గురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండనున్నాయి. హోం శాఖను ఎస్టీ మహిళ సీతక్కకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. వైఎస్, రోశయ్య, కిరణ్ హయాంలో సబితా హోం మంత్రిగా పని చేసారు. ఆ తరువాత ఏపీలో 2019 నుంచి 24 వరకు ఎస్సీ మహిళలే హోం మంత్రులుగా వ్యవహరించారు.

Take a Poll

revanth-led-cabinet-expansion-is-likely-to-take-place-on-april-3

సీతక్కకు హోం శాఖ
ప్రస్తుతం ఏపీలో ఎస్సీ వర్గానికి చెందిన అనిత హోం మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో, తెలంగాణలో ఎస్టీ వర్గానికి చెందిన మహిళ సీతక్కకు ఈ శాఖ అప్పగించాలని ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హోం శాఖ అంటే ఇష్టమని తాజాగా వ్యాఖ్యానించారు. ఇక.. విద్య శాఖ వివేక్ కు అప్పగిస్తారని తెలుస్తోంది. వాకాటి శ్రీహరికి బీసీ సంక్షేమ శాఖ కేటాయిస్తారని సమాచారం. ఇక.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సుదర్శన్ రెడ్డికి అప్పగి స్తారని పార్టీ నేతల సమాచారం. ఢిల్లీ పర్యటన సమయంలోనే పార్టీ అధినాయకత్వంతో రేవంత్ సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు.. శాఖల కేటాయింపు పైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉగాది నాడు మంత్రివర్గ విస్తరణ చేపడతారని తెలుస్తోంది. ఆ రోజు కాకుంటే, ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఖాయమని చెబుతున్నారు. దీంతో, మంత్రివర్గ విస్తరణ వేళ చివరి నిమిషం లో చోటు చేసుకునే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

మంత్రుల శాఖల్లో కోత
సీనియర్ నేతలు మ‌ల్లు భట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీల‌క శాఖ‌ ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు. వారికి కేటాయించిన అదనపు శాఖల్లోనూ కోత పడే అవకాశం కనిపిస్తోంది. ఆర్దిక శాఖతో పాటుగా విద్యుత్ ప్రస్తుతం భట్టి వద్ద ఉంది. ఆర్దిక శాఖను కొనసాగిస్తూ.. విద్యుత్ శాఖ ను మరో మంత్రికి కేటాయిస్తారని చెబుతున్నారు. ఉత్త‌మ్ నీటి పారుద‌ల శాఖతో పాటు పౌర స‌ర‌ఫ‌రాల శాఖను నిర్వ‌ర్తిస్తున్నారు. పౌర సరఫరాల శాఖను జూపల్లికి కేటాయించి.. ఆయన వద్ద ఉన్నఎక్సైజ్ శాఖ మంత్రిగా రాజగోపాల్ రెడ్డి అవకాశం దక్కితే ఆయనకు ఇవ్వాలనే ప్రతిపాదన తె మీదకు వచ్చింది. ఇక.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూతో పాటు గృహ నిర్మాణం, స‌మాచార శాఖ‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు. పొంగులేటి వద్ద ఉన్న మూడు పోర్టు ఫోలియోల్లో సమాచార శాఖను తప్పించి.. మరొకరికి ఇచ్చే అవకాశం ఉంది. కాగా, ఇదే సమయంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్టీల కు దక్కనుంది. ఇక.. చీఫ్ విప్, విప్ పదవుల పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గం.. నామినేటెడ్ పోస్టుల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో.. ఎవరికి ఏ పదవి దక్కుతుందనే టెన్షన్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+