రేవంత్ ఆపరేషన్ గులాబీ - మరో నలుగురు జంప్..!!
సీఎం రేవంత్ ఆపరేషన్ గులాబీ ముమ్మరం చేసారు. పార్టీని ఖాళీ చేయటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, బీఆర్ఎస్ అలర్ట్ అయింది. అయితే..బీఆర్ఎస్ నుంచి జంపింగ్ జాబితాలో ఉన్నదెవరనేది ఉత్కంఠగా మారుతోంది.
వరుస షాక్ లతో
బీఆర్ఎస్ కు వరస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా.. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరికపై అక్కడి కాంగ్రెస్ నేతల అభ్యంతరాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సరితను సముదాయించాలని అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ అధినాయకత్వం సూచన మేరకు ఎమ్మెల్యే చేరికకు మార్గం సుగమమయింది. కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ మారతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ రోజు ఆయన కాంగ్రెస్ లో చేరారు.

కాంగ్రెస్ గూటికి
బీఆర్ఎస్ కు చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. అందులో గ్రేటర్ ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వనిపిస్తున్నాయి. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రేటర్ లో పట్టు కోసం స్థానిక నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోగా శనివారం జరిగన కౌన్సిల్ సమావేశానికి రాకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. కౌన్సిల్ భేటీకి ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు.

లిస్లులో ఉన్నదెవరు
కౌన్సిల్ భేటీకి కచ్చితంగా హాజరుకావాలనిఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏమయ్యారు..? బీఆర్ఎస్‌కు బై బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారా..? లేకుంటే మరేదైనా కారణాలతో డుమ్మా కొట్టారా అనేది తెలియట్లేదు. రాష్ట్ర రాజధాని పరిధిలో బీఆర్‌ఎస్‌కు 14 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ నాయకత్వం కొందరితో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా కేసీఆర్ గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. భవిష్యత్ పై భరోసా కల్పించే ప్రయత్నం చేసారు. ఇక..తాజా పరిణామాలతో బీఆర్ఎస్ లో మిగిలే ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications