వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కుటుంబానికి డ్రగ్స్ వ్యాపారంతో లింకు: రేవంత్ రెడ్డి

కెసిఆర్ కుటుంబమే మాదక ద్రవ్యాల విక్రయాల్లో ఉందని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ విక్రయించేవారిని ఎన్‌కౌంటర్ చేస్తే మద్దతిస్తామని ఆయన ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కెసిఆర్ కుటుంబమే మాదక ద్రవ్యాల విక్రయాల్లో ఉందని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ విక్రయించేవారిని ఎన్‌కౌంటర్ చేస్తే మద్దతిస్తామని ఆయన ప్రకటించారు.

శుక్రవారంనాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.డ్రగ్స్ కేసులో సంస్థలు, వ్యక్తులను బాధ్యులను చేస్తున్నారని , గతంలో మూడుంటే మూడేళ్ళలో 57 పబ్‌లకు అనుమతులు ఇచ్చారని ఆయన విమర్శించారు.

 Revanth Reddy alleges KCR family’s involvement in drug case

అలాగే మ్యూజికల్ నైట్‌ను, ముంబై, గోవాలో రద్దు చేస్తే హైద్రాబాద్‌లో ఎందుకు అనుమతులు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. సీఎం కెసిఆర్ కుటుంబసభ్యులకు మాదకద్రవ్యాల వ్యాపారంలో ఉందని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు.

అలాగే కెసిఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే నైతికత లేదన్నారు. కాగా, ఈవెంట్ మేనేజర్‌కు స్వాగతం పలికిన పోలీసు అధికారిని నడిరోడ్డుపై కాల్చి చంపాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ మనమడు చదువుతున్న స్కూల్‌లో డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయని చెప్పారు. మరోవైపు రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత మంత్రి కెటిఆర్ ఎక్కడకు వెళ్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Telangana Telugu Desam Party (TTDP) working president Revanth Reddy accused the Special Investigation Team (SIT) of selective investigation. He directly questioned SIT as to why notices were not issued to pubs owned by IT minister K. Taraka Ramarao’s family and friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X