కెసిఆర్ ఎఫెక్ట్: కాంగ్రెస్, టిడిపిలు చేతులు కలిపేందుకు రెఢీ, విపక్షాల ప్లాన్ ఇదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు కెసిఆర్ వ్యతిరేకశక్తులు ప్లాన్ చేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కెసిఆర్ ను గద్దెదించేందుకుగాను కాంగ్రెస్ , టిడిపిలు ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అనుసరిస్తున్న విధానాల కారణంగా విపక్షాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అధికారంలోకి వచ్చిన ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టిఆర్ఎస్ వల వేసింది.

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసింది టిఆర్ఎస్.అయితే అదే సమయంలో కెసిఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవడానికి విపక్షాలు కూడ ప్రణాళికలను సిద్దం చేస్తున్నాయి.

కోదండరామ్, గద్దర్, పవన్ కళ్యాణ్ లతో కలిసి సిపిఎం ఓ ఫ్రంట్ కు రూపకల్పన చేస్తోంది. అయితే ఆయా సంస్థలు, పార్టీలతో సిపిఎం ఇంకా చర్చలు ప్రారంభదశలోనే ఉన్నాయి. ఇటీవలనే పవన్ కళ్యాణ్ తో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చర్చించారు.

కాంగ్రెస్, టిడిపి ఒక్కటికావాలి

కాంగ్రెస్, టిడిపి ఒక్కటికావాలి

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరు. అయితే వచ్చే ఎన్నికల్లో టిఆర్ ఎస్ కు చెక్ పెట్టేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు కెసిఆర్ వ్యతిరేకశక్తులు ఈ ప్రయత్నాలను ప్రారంభించాయి. అయితే రాజకీయంగా తెలంగాణలో టిడిపిని తీవ్రంగా నష్టపర్చిన టిఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీతో కూడ కలిసిపనిచేస్ందుకు సిద్దమని టిడిపి ప్రకటించింది.

తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ను గద్దెదింపేందుకు కాంగ్రెస్, టిడిపి ఒక్కటికావాల్సిన అవసరం ఉందని టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ను దెబ్బకొట్టే ప్రతి ప్రయత్నంలో తాము ముందుంటామని టిడిపి ప్రకటించింది.

బీహార్ తరహాలో మహాకూటమి

బీహార్ తరహాలో మహాకూటమి


బీహార్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణలో కూడ విపక్షాలన్నీ కూడ కూటమిగా ఏర్పడి పోటీచేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కెసిఆర్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు ఈ తరహా ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలున్నాయని వారు అభిప్రాయంతో ఉన్నారు.గత ఎన్నికల సమయం నాటికి ప్రస్తుత పరిస్థితులకు రాష్ట్రంలో చాలా తేడా ఉంది. అయితే ఈ పరిణామాలను అధికార టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలకు అర్ధమయ్యేలా వివరించగలిగితే ఆ పార్టీలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

 రిజర్వేషన్ల అంశంపై ప్రజల్లోకి

రిజర్వేషన్ల అంశంపై ప్రజల్లోకి

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో తీర్మాణం చేశారు. దీన్ని కేంద్రానికి పంపారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కారణంగా బిసిలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని టిడిపి ఆరోపిస్తోంది. అయితే ఈ వాదనతో అధికార టిఆర్ఎస్ ఏకీభవించడం లేదు.బీసీలకు 52 శాతం,ఎస్సీలకు18 శాతం న్యాయబద్దంగా రావాల్సిన రిజర్వేషన్లను ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.ఈ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళనుంది టిడిపి.

ఫిరాయింపులతో నష్టపోయిన పార్టీలు

ఫిరాయింపులతో నష్టపోయిన పార్టీలు

బంగారు తెలంగాణ సాధనకు అధికారపార్టీలో భాగస్వామ్యం కావాలనే ప్రచారం నేపథ్యంలో టిడిపికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడ టిఆర్ఎస్ లో చేరారు.ఫిరాయింపులు ఈ రెండు పార్టీలను తీవ్రంగా నష్టపర్చాయి. టిడిపిని లక్ష్యంగా సాగించిన ఆపరేషన్ ఆకర్ష్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను టిఆర్ఎస్ లో చేర్చుకొనే కార్యక్రమాలను విజయవంతం చేసింది టిఆర్ఎస్.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Tdp working president Revanth reddy appealed to congress leaders to work together.he participated in party programme in Nizambad district on Friday.
Please Wait while comments are loading...