Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాగార్జునను సీఎం రేవంత్ రెడ్డి 400 కోట్లు డిమాండ్ చేశారా!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన, హైదరాబాద్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలపైన బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక ఏం జరిగిందనేది ప్రజలు గుసగుసలాడుతున్నారని బయట దీనిపైన పెద్ద చర్చ జరుగుతుందని పేర్కొన్నారు బాల్క సుమన్ .

నాగార్జునకు రేవంత్ రెడ్డి డిమాండ్.. ఇవ్వనందుకే కూల్చివేతలు
నాగార్జునను రేవంత్ రెడ్డి 400 కోట్లు అడిగారని నాగార్జున ఆ మొత్తం ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినట్టు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో హిమాయత్ సాగర్ లో కట్టిన ఆనంద్ కన్వెన్షన్ ను ఎందుకు కూల్చలేదని బాల్క సుమన్ ప్రశ్నించారు. ఆనంద్ కన్వెన్షన్ యజమానులు రేవంత్ సోదరులకు ముడుపులు చెల్లించారని, అందుకే దానిని కూల్చకుండా వదిలేసారని బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy asked Nagarjuna for 400 crores Balka Suman sensational comments

ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ దందా
ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన నడవడం లేదని ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు తమ నాయకుల వ్యక్తిత్వాలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు పెడుతున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు.

వారికి హెచ్చరిక
రేవంత్ టీం లో ఉండి ఫేక్ న్యూస్ లు పెడుతున్న వారిని కెసిఆర్ కేటీఆర్ వదిలిపెట్టిన తాను వదిలి పెట్టేది లేదని బాల్క సుమన్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా హైడ్రా డ్రామాలకు తెరతీసిందని బాల్క సుమన్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో దరిద్రపు పాలన నడుస్తుందని ఆయన విమర్శించారు.

సునీల్ స్క్రిప్ట్ ప్రకారమే తిట్ల పురాణం
సునీల్ కనుగోలు స్క్రిప్ట్ ప్రకారమే తిట్ల పురాణం, హైడ్రా డ్రామా కొనసాగుతుందని బాల్క సుమన్ విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి రాజ్యమేలుతుందని కుటుంబ పాలన కొనసాగుతుందని, దందాలు యదేచ్ఛగా నడుస్తున్నాయని బాల్క సుమన్ నిప్పులు చెరిగారు.పార్టీ ఫిరాయింపుల పైన రాహుల్ గాంధీకి ఒక విధానం రేవంత్ రెడ్డికి ఇంకో విధానం ఉంటుందా అంటూ బాల్క సుమన్ ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్
హైడ్రా పేరుతో భయపెట్టి వసూళ్ల దందా చేస్తున్నారని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలింగ్ దందాలో భాగంగానే హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారని హైడ్రాపైన ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+