నేను చేసేదేం లేదు, లోకేష్ ఇష్టం: రేవంత్‌తో బాబు, తిరుపతి-హైద్రాబాద్ టూర్ల వెనుక..
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. చంద్రబాబు ఇంటి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో గృహప్రవేశం ఎప్పుడని అధినేతను ప్రశ్నించారు. తనదేముందని, అంతా తన తనయుడు నారా లోకేష్ ఇష్టమని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించా, కానీ: కేసీఆర్, నయీం పైనా స్పందనజూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు పాత ఇంటిని కూలగొట్టి కొత్తగా ఇల్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కొత్త ఇంటి నిర్మాణం పూర్తయింది. అయినప్పటికీ చంద్రబాబు కుటుంబం పార్క్ హయత్ హోటల్లోని లగ్జరీ సూట్‌లోనే ఉంటోంది.
సోమవారం తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గృహప్రవేశం పైన అడిగారు. తనదేం లేదని, అంతా లోకేష్ ఇష్టమని, లోకేష్ చెప్పినప్పుడు వచ్చి నిలబడటమే తన పని అని, అంతకన్నా నేను చేసేది ఏముందని చంద్రబాబు నవ్వుతూ సమాధానం చెప్పారట.

అదివారం ఉదయం తిరుపతిలో ఉన్న చంద్రబాబు సాయంత్రానికి హైదరాబాద్ వచ్చారు. తిరిగి సోమవారం మధ్యాహ్నం తర్వాత తిరుపతికి వెళ్లారు. 24 గంటల వ్యవధిలో తిరుపతి - హైదరాబాద్ మధ్య రెండుసార్లు ప్రయాణానికి కారణాన్ని ఆయన తెలంగాణ టిడిపి నేతలతో వెల్లడించారు. పండితులు వారించిన మీదటే తాను అనుకోకుండా హైదరాబాద్ రావాల్సి వచ్చిందని చెప్పారని తెలుస్తోంది.
ఆదివారం ఉదయం అధికారిక పర్యటనలో భాగంగా తిరుపతి వెళ్లానని, సోమవారం నాడు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాల్సి ఉన్నందున అక్కడే ఉండి పోవాలని అనుకున్నానని, కానీ ఆగమ పండితులు వారించారని, మరో పని నిమిత్తం వచ్చి శ్రీవారికి వస్త్రాలు సమర్పించరాదని చెప్పారని, స్వామికి ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వకూడదని చెప్పారని, అందుకే హైదరాబాద్ వచ్చి రాత్రికి ఉండి వెళ్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications