కేసీఆర్‌పై పోరు ఆగదు: ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి ఇలా (ఫోటోలు)
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ సింహా కూడా కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్‌ను గద్దె దించే వరకూ పోరాడతానని, తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలను, పార్టీని సన్నద్ధం చేస్తాను. ఇప్పుడు నియోజకవర్గంలోనే ఉంటున్నందువల్ల సమస్యలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ప్రజలకు మరింత దగ్గరయ్యాను. మరో 25 ఏళ్లపాటు నేను గెలుస్తాననే నమ్మకం ఉంది'' అని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీలోనే, కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాడుతా: రేవంత్ రెడ్డి
ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్ పరిశీలనలో ఉంది. త్వరలో మరో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో రెండింటిని పరిశీలించిన తర్వాత ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేస్తే అప్పుడు విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ఆదేశాలు జారీ చేశారు.

టీడీపీలోనే, కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాడుతా: రేవంత్ రెడ్డి
దీంతోపాటు తెలంగాణ అంసెబ్లీ సిబ్బంది సమర్పించిన టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య స్వర నమూనా టేపుల్ని పరిశీలన నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపాల్సిందిగా అధికారులను కోర్టు ఆదేశించింది. కాగా, ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఏసీబీ అధికారులు పదే పదే పిలిచి వేధింపులకు గురి చేస్తున్నారంటూ తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకుడు వి.ప్రదీప్ చౌదరి శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు.

టీడీపీలోనే, కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాడుతా: రేవంత్ రెడ్డి
పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్ వాదనలు వినిపించారు. ఈ వాదనలను ఏసీబీ తరపు న్యాయవాది రవికిరణ్‌రావు ఖండించారు. ఒక కేసులో సాక్షిని ఎన్నిసార్లయినా విచారించే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుందని పేర్కొన్నారు.

టీడీపీలోనే, కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాడుతా: రేవంత్ రెడ్డి
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి వివరణ చెప్పాలని రవికిరణ్ రావును ఆదేశించింది. తదుపరి విచారణను జస్టిస్ శేషసాయి ఈనెల 18కి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications