Revanth Reddy: ఏ అవకాశాన్ని వదలని రేవంత్ రెడ్డి.. విద్యార్థి నేత నుంచి సీఎం పదవికి ఎదిగారిలా
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా మరో రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యంగా కొనసాగిన ఆయన ప్రస్థానం చివరకు గమ్యం చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ తెలంగాణలో మూడో స్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్గీ మార్చడంలో రేవంత్ సఫలీకృతమయ్యారు. విద్యార్థి నాయకుడిగా తన పయనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతుండటం విశేషమైన అంశమే.
అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబర్ 8న జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. వనపర్తిలో రేవంత్ పాలిటెక్నిక్ చేశారు. మొదట ఏబీవీపీలో విద్యార్థి నాయాకుడిగా పనిచేశారు. ఆ తర్వాత తొలుత 2002లో టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో కొంత కాలమే కొనసాగారు రేవంత్.

ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తన సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా.. కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీ సభ్యుడిగా రేవంత్ గెలుపొందారు.
ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబబూబ్‌నగర్‌లో దాదాపు 100 ఓట్లు ఆధిక్యమున్న అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారు. ఆ తర్వాత 2008లో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో దిగిన రేవంత్.. కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై 6989 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 14,614 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి కొడంగల్ నుంచే విజయం సాధించారు.

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, శాసనసభా పక్ష నేతగా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడారు. అనంతర పరిణామాల నేపథ్యంలో 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే, 2019 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.
అనంతరం 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు రేవంత్ రెడ్డి. ఆయనపై పార్టీలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. వాటిని అధిగమించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హెలికాప్టర్‌లో సుమారు 80 నియోజకవర్గాలకు పైగా కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు రేవంత్.
కొడంగల్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజార్టీ రావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కారణమైన రేవంత్‌నే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. కాగా, కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి దగ్గరి బంధువైన గీతారెడ్డితో 1992లో రేవంత్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె.

కాగా, వాస్తవంగా రేవంత్ రెడ్డికి ఆయన శ్రమతోపాటు కొంత అదృష్టం కూడా తోడైందనే చెప్పాలి. వంద శాతం అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం అవడానికి 20 ఏళ్లు వేచి చూశారు. కేసీఆర్ 14 ఏళ్లు పట్టింది. వైఎస్ జగన్‌కు 10ఏళ్లు పట్టింది. ఇక రేవంత్ రెడ్డికి కేవలం 2 ఏళ్లు పట్టడం గమనార్హం. ఓటుకు నోటుతో షేన్ అయిన రేవంత్ రెడ్డి ఆరేళ్లుగా అదే టెంపో మెయింటైన్ చేశాడు. దూకుడు స్వభావంతో దూసుకెళ్లారు. డబ్బు, కుల బలం, దూకుడు స్వభావం కాంగ్రెస్ లాంటి గొప్ప వేదిక దొరకడం కూడా ఆయనకు కలిసివచ్చింది.
రేవంత్ లాంటి దూకుడు స్వభావం ఉన్న వాళ్ళు కాంగ్రెస్‌లో ఆ సమయానికి లేకపోవడం రేవంత్ కి మరింత అనుకూల అంశంగా మారింది. తాను అకున్న లక్ష్యం కోసం షార్ట్ కట్స్ కూడా ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలోనే కేవలం రెండే రెండేళ్లలో సీఎం అయ్యారు. కేవలం 17 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవిని అందుకోవడం విశేషం. ఇక, డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
-
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
లొట్టలేసుకుంటూ ఉస్మానియా బిస్కెట్ తింటున్నారా- జరా సోచాయించుండ్రి -
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..!











Click it and Unblock the Notifications