కేసీఆర్ ఫామ్హౌస్ అయినా.. వరంగల్ హంటర్ రోడ్ అయినా.. మేం రెడీ: రేవంత్‌రెడ్డి సవాల్!!
దాడుల రాజకీయాలపై కేసీఆర్‌కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి, సమయం, తేదీ నిర్ణయించాలని కోరారు. కెసిఆర్ ఫామ్హౌస్ అయినా.. వరంగల్ హంటర్ రోడ్ అయినా ఎక్కడైనా సిద్ధమంటూ పేర్కొన్నారు.
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన తెలంగాణ ప్రభుత్వం పై, తెలంగాణ సీఎం కేసీఆర్ పై, స్థానిక బిఆర్ఎస్ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంగళవారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ ను చెత్త కుప్పలా మార్చిన దండుపాళ్యం ముఠా
దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వరంగల్ కు 2014లో గ్రహణం పట్టిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్ లో తన పైన కోపంతో అభివృద్ధి చేయలేదని, వరంగల్ నియోజకవర్గంలో కొండా దంపతుల పైన కోపంతో చేయకుండా వరంగల్ ను కుప్పతొట్టిలా మార్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరంగల్లో బీఆర్ఎస్ నాయకులను దండుపాళ్యం ముఠా అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వరంగల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు గంజాయి అలవాటు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

యూనివర్సిటీ పరిస్థితిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
ప్రజలపై ఆధిపత్యం చలాయించే ప్రతి సందర్భంలో కూడా కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు స్పందించారని, కానీ యూనివర్సిటీలో ప్రస్తుతం చదువు చెప్పే గురువులు లేరని, నియామకాలు లేవని పేర్కొన్నారు. ఉన్నవాళ్లకు జీతాలు లేవు, విద్యార్థులకు వసతులు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని మండిపడ్డారు. ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గతంలో పీజీ చదివిన సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఉటంకించారు రేవంత్ రెడ్డి.

మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు
అంతేకాదు వరంగల్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండుసార్లు పట్టం కట్టారని, అదే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి కెసిఆర్, కేటీఆర్ ఇద్దరు విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బెల్ట్ తీస్తాం
రాష్ట్రంలో మూడు వేల వైన్ షాపులు 60 వేల బెల్ట్ షాపులు కేసీఆర్ తీసుకొచ్చారని దీని వల్ల మహిళలు తీవ్రంగా బాధపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ రాగానే గ్రామాలలో బెల్ట్ షాపులు ఉంటే బట్టలూడదీసి కొట్టి బొక్కలో వేయిస్తానంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు బజార్లను తెరిపిస్తే, ఈనాడు బెల్టు షాపులను తెరిచారని వీటిని కాంగ్రెస్ రాగానే రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

దాడులే ప్రాతిపదికగా రాజకీయం చేద్దామంటే.. డేట్ , టైం ఫిక్స్ చెయ్
దాడులే ప్రాతిపదికగా రాజకీయం చేద్దామంటే కెసిఆర్ తేదీ.. స్థలం ప్రకటించాలని పేర్కొన్న రేవంత్ రెడ్డి కెసిఆర్ ఫామ్హౌస్ అయినా.. వరంగల్ హంటర్ రోడ్ అయినా ఎక్కడైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పైన బీఆర్ఎస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన, తన పాదయాత్రకు వస్తున్న ప్రజల మద్దతును చూసి ఓర్వలేక తమ పార్టీ నాయకుడి పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రేవంత్ రెడ్డి పాదయాత్రతో వరంగల్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications