టీడీపీ సభ్యుల సస్పెండ్‌పై జానా, కడియంపై రేవంత్
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో మనకంటే ఎక్కువ గొడవ జరిగినా స్పీకర్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మూడు రోజులే సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు సభలోకి వచ్చేలా స్పీకర్ చొరవ చూపాలని కోరారు.
ఇక బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యులను అసెంబ్లీ సమావేశాల సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం సరికాదని, అలా చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. సస్పెన్షన్‌పై స్పీకర్ పునరాలోచించాలని కోరారు.
తెలంగాణ బడ్జెట్‌పై చర్చకు టీడీపీ సభ్యులను అనుమతించాలని, వారులేని లోటు సభలో కనిపిస్తోందని లెఫ్ట్ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, రాజయ్య అన్నారు. సభలో గందరగోళ వాతావరణలో టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పలేకపోయారని వారు అన్నారు.

జానా వ్యాఖ్యలకు నాయిని స్పందిస్తూ మహారాష్ట్రలో సభ్యులను రెండు సంవత్సరాలు సస్పెండ్ చేశారని దీనికేం మీరేం చెబుతారని నాయిని నర్సింహారెడ్డి ఎదురు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల వైఖరి సరిగా లేదని, కావాలనే వారు జాతీయ గీతాన్ని అవమానపరిచారన్నారు. ఏ పార్టీకైనా విమర్శించే అర్హత ఉంటుందని మంత్రి ఈటెల రాజేందర్ సభకు తెలిపారు.
రాష్ట్రంలో అసెంబీల సమావేశలా వాడివేడిగా జరుగుతుంటే, తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి రెండు రోజులు క్రితం పార్లమంట్‌లో తళుక్కుమన్నారు. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్ధానం నుంచి బరిలోకి దిగిన కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య బర్తరఫ్ తర్వాత అనూహ్యంగా తెలంగాణ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు.
ఇప్పటి వరకు కడియం శ్రీహరి తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. అలాగని రాష్ట్రంలో ఇటు అసెంబ్లీతో పాటు, మండలిలో కూడా సభ్యుడిగా లేరు. రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరగుతున్న నేపథ్యంలో సభలో ఉండి సమాధానాలు చెప్పకుండా, పార్లమెంట్‌కు ఎందుకు వెళ్లారని, అసలక్కడ ఆయనకేం పనంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపనేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications