నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నక్సలైట్లు ఉంటే బాగుండేది: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను చూస్తే నక్సలైట్లు ఉంటే బాగుండేదనిపిస్తోందని తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని, దళిత యువకులను టిప్పర్‌తో గుద్ది చంపేసినా ప్రశ్నించే వారే లేరని ఆయన అన్నారు.

ఆర్మూర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట గత నెల 9న జరిగిన తలారి సత్యం యాక్సిడెంట్‌ వ్యవహారాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజలు ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణను కోరుకున్నారని అన్నారు. కానీ, రాజ్యాన్ని ప్రశ్నించిన శృతి, సాగర్‌, వివేక్‌లను ప్రభుత్వం ఎన్‌కౌంటర్లతో పొట్టన పెట్టుకుందని అన్నారు.

ఎమ్మెల్యేపై కేసు వేశాడని సత్యాన్ని చంపేశారని, ప్రభుత్వంలో ఎవరికీ భయం లేదని, అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని, ఇలాంటి సమయంలోనే నక్సలైట్లు ఉంటే బాగుండేదని, ప్రజా ప్రతినిధులకు భయం ఉండేదని, ఇలాంటి హత్యలు ఆగేవని, నక్సలైట్లు లేకపోవడంతో విచ్ఛలవిడితనం పెరిగిందని ఆయన అన్నారు.

Revanth Reddy

ఇవే పరిస్థితులు కొనసాగితే యువత మరో దారి వెతుక్కోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సత్యం హత్యకు నిరసనగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఏడో రోజైన ఆదివారం దీక్షలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.

దళిత నేత సత్యం యాక్సిడెంట్‌ కేసులో నిజాలు బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు. సత్యం గత ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఆర్మూర్‌ నుంచి పోటీ చేశాడని, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో అన్ని వివరాలనూ సమర్పించలేదని కేసు వేశాడని, ఈసీ స్పందించకపోతే హైకోర్టులో కేసు వేశాడని ఆయన గుర్తు చేశారు.

అప్పటి నుంచే సత్యానికి వేధింపులు పెరిగాయని, ఒక దశలో ఎన్‌కౌంటర్‌కూ యత్నించారని, మానవ హక్కుల సంఘం, ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలుస్తామని తెలిపారు.

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సత్యాన్ని బెదిరిస్తుండడంతో తెలంగాణ టిడిపి నేత రాజారాం యాదవ్‌తో మరో పిటిషన్‌ను హైకోర్టులో వేయించగా ఆయనకూ బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణను తెచ్చుకున్నది ఇలా దళిత యువకులను హత్యలు చేసేందుకా అని ప్రశ్నించారు. దీనిపై దళిత సంఘాలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

English summary
Telangana TDP leader Revanth Reddy made controversial comments on naxalites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X