రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలుశిక్ష: సూరత్ కోర్టు తీర్పుపై షాకైన రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే!!
ఏఐసిసి మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కి సూరత్ కోర్ట్ 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంపై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పరువు నష్టం కేసులు వేసి రాహుల్ గాంధీ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యలకు భయపడబోమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ దేశంలో పాలకుల నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారని రేవంత్ రెడ్డి ట్విటర్లో పోస్ట్ పెట్టారు. ఏది తప్పో అది తప్పు అని చెప్పే ధైర్యం రాహుల్ గాంధీకి ఉందని పేర్కొన్న రేవంత్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరించే వాళ్ళు ఈ ధైర్యం గురించి భయపడ్డారని పేర్కొన్నారు. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. సూరత్ కోర్టు నిర్ణయం పై పోరాటం చేసి గెలుస్తామని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Rahul Gandhi is raising his voice against dictatorship. He has the courage to say what is wrong is wrong.
— Revanth Reddy (@revanth_anumula) March 23, 2023
The tyrant is nervous about this “COURAGE”
We will fight and win. pic.twitter.com/AEbHF7G4TX
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దోషగా తేలారు. ఈ మేరకు సూరత్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మోడీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ పై పరువు నష్టం కేసు వేశారు. విచారణ జరిపిన గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications