వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్లు తాగిన కోతిలా: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కల్లు తాగిన కోతిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. వరంగల్ జిల్లా ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. కేటీఆర్‌కు స్థానికత వర్తించదని, కేటీఆర్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఓటర్లు వరంగల్ ఉపఎన్నికలో బుద్ధి చెప్పి, కేసీఆర్ కళ్లు తెరిపించాలన్నారు.

వరంగల్ లోక్‌సభ‌కు జరుగుతున్న ఉపఎన్నికలో భాగంగా టీడీపీ, బీజేపీ నేతలు ఎర్రబెల్లి, కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లతో కలిసి రేవంత్‌రెడ్డి స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రచారం నిర్వహించారు.

 Revanth reddy Fires on CM KCR at station ghanpur

గృహనిర్మాణ పథకానికి ఉచిత ఇసుక

రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల గృహనిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం ఈ విషయమై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కొత్త ఇసుక పాలసీ-2014 ప్రకారం స్థానిక సంస్థలు, గ్రామస్తులు గృహ అవసరాల కోసం వాగులో ఉన్నా ఇసుకను వాడుకోవచ్చని తెలిపారు.

అంతేకాదు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి సీవరేజ్ చార్జీలు లేకుండా ఇసుకను వాడుకోవచ్చని సూచించారు. వెనుకబడిన తరగతుల వారు సొంత అవసరాలకు కూడా ఎటువంటి ఛార్జీలు లేకుండా ఇసుకను వాడుకోవచ్చని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

పంచాయతీరాజ్ కమిషనర్‌గా అనితారాంచంద్రన్ కొనసాగింపు

పంచాయతీ రాజ్ కమిషనర్‌గా అనితారామచంద్రన్‌ను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సురేంద్రమోహన్‌ను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

English summary
Revanth reddy Fires on CM KCR at station ghanpur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X