Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల సర్వేలో అధికారులను పరుగులు పెట్టిస్తున్న రేవంత్ సర్కార్!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పనిలో పడింది. ఈ క్రమంలో తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గుర్తింపు కోసం సర్వే కొనసాగుతుంది.

ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల కోసం సర్వే
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే కోసం ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ ను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ యాప్ ద్వారా అన్ని జిల్లాలలో సర్వే కొనసాగుతుంది. ఇప్పటికే ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి అధికారులు వారి ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేకు ఒకరోజు ముందే దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చి ఆ తరువాత సర్వే కొనసాగిస్తున్నారు.

Revanth reddy govt doing indiramma housing scheme beneficiaries survey to fulfill own house dream

జిల్లాలలో అధికారులు ఉరుకులు పరుగులు
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ ఒకరోజు ముందే సమాచారాన్ని ఇచ్చి అధికారులు ఆపై సర్వేను కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోను యుద్ధ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల కోసం సర్వే కొనసాగుతుంది. అయితే ఈ నెలాఖరులోగా ఈ సర్వేను పూర్తి చేయాలని సర్కార్ డెడ్లైన్ విధించడంతో క్షేత్రస్థాయిలో అధికారులను జిల్లా కలెక్టర్లు పరుగులు పెట్టిస్తున్నారు.

ఒక్కొక్క సర్వేయర్ కనీసం 20 దరఖాస్తుల సర్వే
రాష్ట్రవ్యాప్తంగా 80, 54,554 దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్ లో వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ ని ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కొక్క సర్వేయర్ కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లిన తర్వాత అన్ని ధ్రువపత్రాలను పరిశీలించి ఆయా వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నారు.

సర్వే చేసి లబ్దిదారుల డేటా యాప్ లో
ప్రస్తుతం మొదటి విడతలో స్థలం ఉండి నిరుపేదలైన వారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనుంది. ఇక సర్వే చేస్తున్న అధికారులు దరఖాస్తుదారుని ఫోటోతో పాటు వారు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం చేసుకున్న ఖాళీ స్థలాన్ని, అలాగే వారు ప్రస్తుతం ఉంటున్న ఇంటి చిత్రాలను కూడా తీసుకొని యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ నెలాఖరుకు ప్రభుత్వం సర్వేను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, అధికారులు మాత్రం అన్ని జిల్లాలలోను యుద్ధ ప్రాతిపదికన సర్వే కొనసాగిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+