వీరికి మాత్రం రుణమాఫీ రాదు!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసేందుకు కసరత్తు ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంట్లో రుణమాఫీ పథకానికి సంబంధించిన నియమ నిబంధనలను పేర్కొంది. దీని ప్రకారం చాలా మందికి రుణమాఫీపై ఊహించని షాకిచ్చింది. దీంతో తెలంగాణా వ్యాప్తంగా రైతులు చాలామంది ఆందోళనలో ఉన్నారు.

ఈ రైతులకు నో రుణ మాఫీ
రేవంత్ సర్కార్ తాజాగా వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం ఉద్యాన పంటలు సాగుచేసే వారికి ముఖ్యంగా మామిడి, నిమ్మ, బత్తాయి వంటి దీర్ఘకాలిక పంటలకు రుణ మాఫీ రాదు. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందని, దీర్ఘకాలిక పంట రుణాలకు రుణమాఫీ వర్తించదని పేర్కొంది. వరి, చెరుకు, పత్తి, కూరగాయలు వంటి సీజనల్ పంటలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న పంటరుణాలకు ఈ పథకం వర్తించదని వెల్లడించింది.

revanth reddy govt shock to these farmers on loan waiver scheme

రుణమాఫీ వీరికి మాత్రమే
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. పింక్ రేషన్ కార్డు తో పాటు టాక్స్ పే చేసేవారికి రుణమాఫీ వర్తించదని మార్గదర్శకాల ద్వారా తెలుస్తోంది. ఇక పంట రుణమాఫీ కోసం డెడ్ లైన్ కూడా డిసెంబర్ 12 2018 నుంచి డిసెంబర్ 9 2023గా నిర్ణయించింది. కేవలం ఈ మధ్యకాలంలో తీసుకున్న రుణాలకు మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది.

రుణ మాఫీపై రైతులకు రేవంత్ సర్కార్ మెలిక
ప్రకటించిన తేదీలకు అంతకుముందు తీసుకున్న ఆ తర్వాత తీసుకున్న రుణాలకు ఈ స్కీం వర్తించబోదు. అంతేకాదు రుణమాఫీ విషయంలో మరో మెలిక కూడా పెట్టింది రేవంత్ సర్కార్. 2 లక్షలకు పైగా రుణం తీసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది కానీ రెండు లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట రైతులు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం చెప్పిన రెండు లక్షల మొత్తాన్ని రైతుల ఖాతాలోకి బదిలీ చేస్తుంది.

2 లక్షలకు పైబడి రుణం ఉంటే ఇలా చెయ్యాలి
అంటే ముందు రైతు 2 లక్షల పైబడి ఉన్న రుణాన్ని చెల్లించాల్సిందే. రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీ షెడ్యూల్ చేసిన వారి రుణాలకు కూడా వర్తించదని పేర్కొంది. కంపెనీలకు, ఫర్మ్ లకు ఇచ్చిన పంట రుణాలకు రుణమాఫీ వర్తించదు. ఇక రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్న పరిస్థితుల్లో, కుటుంబంలో మహిళల పేరుతో ఉన్న రుణాలను మొదటి మాఫీ చేస్తారు.

చాలామందికి రుణమాఫీ లేనట్టే
ఆ తర్వాత దామాషా పద్ధతిలో పురుషుల పేరుతో తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. మొత్తంగా రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసి అందులో పెట్టిన మెలికలతో చాలామందికి రుణమాఫీ వర్తించదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+