రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు రేవంత్ సర్కారు గుడ్‌న్యూస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' చిత్ర బృందానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ సినిమా యూనిట్ విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదల రోజు(శుక్రవారం) ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు అనుమతి ఇచ్చింది.

ఇక, విడుదల రోజు సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా రూ. 100, మల్టీప్లెక్సుల్లో రూ. 150పెంచుకునేందుకు, జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్ లో రూ. 50, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 1 గంటకు పెంచిన ధరతో బెనిఫిట్ షోకు అనుమతించాలన్న విజ్ఞప్తిని మాత్రం తెలంగాణ సర్కారు తిరస్కరించింది. కాగా, గేమ్ ఛేంజర్ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ఛైర్మన్ దిల్ రాజు కావడం గమనార్హం. ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు.

Revanth Reddy govt s good news for Ram Charan s Game Changer

కాగా, పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటో రేవతి అనే మహిళప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే బెనిఫిట్ షోలకు అనుమతిచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, టికెట్ ధరల పెంపు కూడా ఉండదని తేల్చి చెప్పింది. అయితే, తాజాగా, తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలావుండగా, ఏపీలోనూ గేమ్ ఛేంజర్ చిత్రం కోసం టికెట్ ధరల పెంపుతోపాటు బెనిఫిట్ షోలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షో టికెట్ ధరను రూ. 600గా పన్నులతో కలిపి నిర్ణయించింది. అలాగే, జనవరి 10న ఆరు షోలకు అనుమతిచ్చింది. మల్టీప్లెక్స్‌లో అదనంగా రూ. 175, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 135 వరకూ పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుతిచ్చింది. జనవరి 11 నుంచి 23వ తేదీ వరకు ఇవే ధరలతో ఐదు షోలకు అనుమతి ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+