Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ రెడ్డి చంద్రబాబు బినామీ, కాంగ్రెస్ పార్టీ బాబు ఫ్రాంచైజీ ; కేటీఆర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో కొత్త రచ్చ

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడుగా ముందుకు వెళ్తున్న క్రమంలో, ఆయన దూకుడుకు పగ్గాలు వేయాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకు రేవంత్ రెడ్డి చంద్రబాబు బినామీ, చంద్రబాబు తొత్తు, ఓటుకు నోటు కేసు దొంగ అంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి లో చంద్రబాబునే చూస్తున్న అధికార పక్షం తీరు కాంగ్రెస్ వర్గాలకు కూడా రుచించడం లేదని తెలుస్తుంది. పదే పదే చంద్రబాబు బినామీగా రేవంత్ రెడ్డిని చూపించే ప్రయత్నం జరిగితే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

టీఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ రేవంత్ దూకుడు

టీఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ రేవంత్ దూకుడు

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల విభజనతో ఉనికిని పోగొట్టుకుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ఉనికిని కోల్పోయే ప్రమాదం నెలకొన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చేపట్టారు. అప్పటినుండి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా వెళుతున్నారు. సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఎన్నికల నేపధ్యంలో దళిత బంధు పథకం ప్రకటించటంతో రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా సభలు నిర్వహిస్తూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతల అక్రమాలను, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను, రాష్ట్రంలో విభిన్న వర్గాలు కెసిఆర్ పాలనలో ఏ విధంగా నష్టపోతున్నారు అన్న అంశాలను సవివరంగా చెబుతూ టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తున్నారు. ఇదే క్రమంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

రేవంత్ రెడ్డిని చంద్రబాబు బినామీగా చిత్రీకరించే యత్నం

రేవంత్ రెడ్డిని చంద్రబాబు బినామీగా చిత్రీకరించే యత్నం

ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టక ముందునుండే గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఇక ఆ గ్రూపు రాజకీయాల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ ఇవ్వడంతో పార్టీలోనే విముఖత వ్యక్తమైంది. రేవంత్ రెడ్డి ని చంద్రబాబు బినామీ గా సొంత పార్టీ నేతలే చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పక్క రాష్ట్రంలోని వైసీపీ నేతలు సైతం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు . ఇక అప్పుడు మొదలైన రచ్చ నేటికీ కొనసాగుతోంది. ఎవరు టార్గెట్ చేసినా రేవంత్ రెడ్డిని చంద్రబాబు మనిషిగానే చూపిస్తూ టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు నింపుకోవాలని ప్రయత్నిస్తున్న క్రమంలో చీటికీ మాటికీ చంద్రబాబుకు లింకు పెట్టి రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్న తీరు ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ, అటు కాంగ్రెస్ పార్టీ వర్గాలలోనూ చర్చనీయాంశంగా మారింది.

పార్టీలోనూ సీనియర్ల వ్యతిరేఖత అందుకే .. తాజా విమర్శలపైనా కాంగ్రెస్ లో చర్చ

పార్టీలోనూ సీనియర్ల వ్యతిరేఖత అందుకే .. తాజా విమర్శలపైనా కాంగ్రెస్ లో చర్చ

మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన సీనియర్ నాయకులు ఎంతో మంది ఉండగా, వారందరినీ కాదని తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డి కి టీపీసీసీ చీఫ్ గా అవకాశం ఇవ్వడం వల్లే ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి వచ్చిందని వారిలో అంతర్గత చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డిని సీనియర్ నాయకులు చాలామంది టీపీసీసీ చీఫ్ గా వ్యతిరేకించటానికి చంద్రబాబు మనిషి రేవంత్ అన్నదే ప్రధాన కారణం . ఇక తాజాగా మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ల మధ్య జరిగిన సవాళ్లు ప్రతిసవాళ్ల పర్వం పై స్పందించిన మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పై చంద్రబాబు ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు కూడా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని కూడా చూపిస్తూ పదే పదే రేవంత్ పై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ఫ్రాంచైజీ .. రేవంత్ అధ్యక్షుడుగా అందుకే

కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ఫ్రాంచైజీ .. రేవంత్ అధ్యక్షుడుగా అందుకే


తాజాగా మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి ఎవరి మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నాడో అందరికీ తెలుసని, ఆ చిలక మనదే అయినా పలుకు పరాయిదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఫ్రాంఛైజీలా తీసుకుని రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా చేశారని విమర్శించారు. అంతేకాదు చంద్రబాబు ఆడించే తోలుబొమ్మలాటలో రేవంత్ రెడ్డి ఒక బొమ్మ అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక మల్లారెడ్డి పై సవాల్ చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో తేల్చు కోవాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిని ముందు పెట్టి చంద్రబాబు అంత నడిపిస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ చంద్రబాబు బినామీ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఏమాత్రం మింగుడు పడడం లేదు.

కేటీఆర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నేతల మల్లగుల్లాలు

కేటీఆర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నేతల మల్లగుల్లాలు

ఇదంతా ముందే ఊహించామని, అందుకే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించామని కొంతమంది నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారని సమాచారం. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డిని చంద్రబాబు బినామీలా క్రియేట్ చేస్తూ, రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నార్ధకం చేసే పనిలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. ఇక ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నారు.

చంద్రబాబు బినామీ అన్న అపవాదు నుండి రేవంత్ బయటపడతారా ?

చంద్రబాబు బినామీ అన్న అపవాదు నుండి రేవంత్ బయటపడతారా ?

రేవంత్ రెడ్డి చంద్రబాబు బినామీ అన్న అపవాదు నుండి బయట పడక పోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వారు భావిస్తున్నారు. మొదటి నుండి తెలంగాణా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తో పాటు గులాబీ నేతలు మైండ్ గేమ్ ఆడుతూ ప్రజల్లో ప్రతిపక్ష పార్టీల పట్ల ఒక రకమైన భావజాలాన్ని వ్యాప్తి చేసే పనిలో ఉన్నారు.ఇప్పుడు ఈ పరిస్థితి రేవంత్ ను చిరాకు పెడుతుంది. ఒకపక్క సొంత పార్టీలో అసమ్మతి వాదులు, మరోపక్క అధికార టీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిలో చంద్రబాబును చూస్తుంటే ఈ సమస్యలన్నింటినీ అధిగమించి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ను ముందుకు నడిపిస్తారా అనేది ఆసక్తికర విషయం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+