హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ అమెరికాలో బాత్రూంలు కడిగారు: హరీష్‌రావుపై బాంబుపేల్చిన రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

సిరిసిల్ల/నల్గొండ: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మితే మోసపోతామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం అన్నారు. తెరాసకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా తెలంగాణ మారలేదని చెప్పారు. ఆయన కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లతో పాటు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు.

సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి కేసీఆర్, కేటీఆర్ ఓడిపోవాలని మంత్రి(ఆపద్ధర్మ) హరీష్ రావు కోరుకుంటున్నారని ఆరోపించారు. వాళ్లు ఓడిపోతే పార్టీ పగ్గాలు తన చేతికి వస్తాయని ఆయన ఆశపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు వెళ్తారన్నారు.

తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?

తెలంగాణ ద్రోహులకు మంత్రివర్గంలో చోటు

తెలంగాణ ద్రోహులకు మంత్రివర్గంలో చోటు

లక్ష ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు గెలిచినా, ఓడినా జర్మనీలోనే ఉంటారన్నారు. కేవలం సెలవుల్లోనే ఇక్కడకు వస్తారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన దేవత అని సోనియా గాంధీ అని కేసీఆరే అన్నారన్నారు. అమరవీరులకు ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. సమగ్ర సర్వేతో ఏం సాధించలేదని, అమరవీరుల వివరాల కోసం ఒక్క కాలం కేటాయించలేదన్నారు. తెలంగాణ ద్రోహులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు తదితరులకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. మందుపోసిన సంతోష్‌కు పదవి ఇచ్చారన్నారు. నిత్యం ప్రజల్లో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ను గెలుపించాలన్నారు.

కేసీఆర్ వేలకోట్లు సంపాదించారు

కేసీఆర్ వేలకోట్లు సంపాదించారు

తెలంగాణ ఉద్యమంలో ఒక్క దొర అయినా బలిదానం చేసుకున్నాడా అని రేవంత్ నిలదీశారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను రాబందుల్లా పీక్కుతింటున్నారన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిన వారెవరూ ఆస్తులు కూడబెట్టుకోలేదని, కేసీఆర్‌ మాత్రం వేల కోట్లు సంపాదించారన్నారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారనే అంశంపై అమరవీరుల స్తూపం వద్ద హరీష్ రావు, కేటీఆర్‌ చర్చకు సిద్ధమా అని రేవంత్ నిలదీశారు.

హరీష్ రావుపై మరోసారి బాంబు పేల్చిన రేవంత్

హరీష్ రావుపై మరోసారి బాంబు పేల్చిన రేవంత్

కేసీఆర్‌ను ఓడించాలని హరీష్ రావు తమ పార్టీ నేత, గజ్వెల్ నియోజకవర్గ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డితో చర్చలు జరిపారని మరోసారి బాంబు పేల్చారు. బతుకమ్మ చీరలు సిరిసిల్లలో కొనుగోలు చేయకుండా సూరత్‌లో కొనుగోలు చేశారన్నారు. తెలంగాణ పరిస్థితిని చూసి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన కన్నీళ్లను కళ్లలోనే దాచుకున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో వ్యక్తులే లాభపడ్డారని చెప్పారు. సిరిసిల్లలో పేదరికాన్ని, నేతన్నల ఆత్మహత్యలను ఆపలేకపోయారని చెప్పారు. రాష్ట్రం సాకారమైన తర్వాత కూడా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకన్నారని, ఒక్క కుటుంబాన్ని ఆదుకోలేదన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితలులను పరామర్శించలేదన్నారు.

కేటీఆర్ అమెరికాలో బాత్రూంలు కడిగారు

కేటీఆర్ అమెరికాలో బాత్రూంలు కడిగారు

తాను కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లను దత్తత తీసుకుంటానని రేవంత్ చెప్పారు. ఇటీవల కేటీఆర్ కొడంగల్ వెళ్లినప్పుడు తెరాసను గెలిపిస్తే తాను కొడంగల్‌ను దత్తత తీసుకుంటానని చెప్పారు. దీనికి కౌంటర్‌గా నేడు రేవంత్ చెప్పారు. ఇక్కడి సమస్యలను కేటీఆర్ పరిష్కరించలేదన్నారు. వారానికోసారి చేనేత బట్టలు ధరించాలని కేటీఆర్ చెప్పారని, ఆయన ధరిస్తున్నారా అన్నారు. చెప్రాసీగా కూడా కేటీఆర్ పనికి రారని చెప్పారు. అమెరికాలో కేటీఆర్ బాత్రూంలు కడిగిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుందని చెప్పారు.

English summary
Telangana Congress working president Revanth Reddy hot comments on Minister Harish Rao and lashed out at Minister KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X