కేసీఆర్ అంటే కచరా: కొత్త అర్థం చెప్పిన రేవంత్ రెడ్డి, గవర్నర్‌పై నిప్పులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఎన్డీఎస్ఎల్ కర్మాగారాల పునరుద్ధరణకు జరుగుతున్న రిలే దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని కేసీఆర్ ప్రభుత్వం చెబుతోందని, కానీ అప్పులతో అల్లాడిపోతున్న రైతులను ఎలా ఆదుకుంటుందో చెప్పడం లేదన్నారు.

సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటే.. క.చ.రా అంటూ రేవంత్ మండిపడ్డారు. గవర్నర్‌కు కాళేశ్వర్ చంద్రశేఖర రావులా కనిపిస్తే ఆయన మాకు కచర చంద్రశేఖర రావులా కనిపిస్తున్నారన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎంపీ కవితలను ఉత్తములుగా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రచారం చేస్తోందన్నారు. అటువంటి ప్రభుత్వానికి ఎన్డీఎస్ఎల్ కర్మాగారాలను నడిపించే శక్తి లేదా అని ప్రశ్నించారు.
గవర్నర్ నరసింహన్ పైనా రేవంత్ మండిపడ్డారు. గుడిబాట వీడి పొలంబాట పడితే క్షేత్ర స్థాయిలో సర్కారు పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు.
రేవంత్ చేరికతో కాంగ్రెస్ మరింత పతనం: పోచారం
Recommended Video

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ మరింత పతనం దిశకు చేరిందని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను విమర్శించే నైతిక అర్హత రేవంత్‌కు లేదన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు దేశ, విదేశీ ప్రతినిధులు హర్షిస్తున్నారని చెప్పారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications