రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి హౌస్ అరెస్ట్.. మోదీకి కేసీఆర్ కోవర్టు : కాంగ్రెస్ నేతల ఫైర్
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై కేసు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్లల్లో ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎప్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీనేతలు నిరసనకు దిగారు. ఈక్రమంలో హస్తం పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. భారీగా పోలీసుల మోహరింపు..
తెలంగాణ పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. రేవంత్‌ను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. మహిళలను కించపరిచేవిదంగా మాట్లాడిన అస్సాం సీఎంపై కేసు నమోదు ఎందుకు చేయడంలేదని ఆయన పోలీసులను నిలదీశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద రేవంత్ రెడ్డి ఆందోళనకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఆయన పోలీసులు గృహనిర్భందం చేశారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

కోమటి రెడ్డి, భట్టి అరెస్ట్
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్ల వద్ద ధర్నాలకు యత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీని జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధుయాష్కీ తదితరులను అడ్డుకున్నారు. వారిని గృహనిర్భందం చేశారు.జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులను, డీసీసీ అధ్యక్షులను కూడా పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్పు ఏవిధంగా ఉంటుందో.. ఈ అక్రమ అరెస్టులు దీనికి నిదర్శనమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.
Recommended Video

మోదీకి కోవర్టుగా కేసీఆర్
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై కేసు నమోదు చేసేవరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరసన తెలిపి స్వేచ్ఛకూడా లేకుండా పోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి కోర్టు అని ఆరోపించారు. కమలం పార్టీకి లాభం చేసేందుకే కేసీఆర్ మూడో ఫ్రంట్ ముచ్చటని తీసుకువచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్‌ను ప్రధాని మోదీ కోవర్ట్‌గా వాడుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు పడకుండా అడ్డుకునేందుకు మోదీ, కేసీఆర్ అడుతున్న వ్యూహమని ఆరోపించారు.












Click it and Unblock the Notifications