ఓటుకు నోటు కేసులో ఏం పీకుతాడు? కేసీఆర్ Vs బాబులా!: రేవంత్ తీవ్ర విమర్శలు
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు కల్లుతాగిన కోతికి తేలుకుట్టినట్లు ఉందని రేవంత్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ఫ్యామిలీపై పెట్టిన కేసులే మాఫీ.. కానీ..
శనివారం ఉదయం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలపై పెట్టిన కేసులను మాత్రమే మాఫీ చేశారని, ఇతర ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. ఉద్యమ కేసుల వల్ల ఇంకా అనేకమంది యువత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

కేసీఆర్ వర్సెస్ చంద్రబాబులా..
ఎన్నికలను కేసీఆర్ వర్సెస్ చంద్రబాబులా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. చంద్రబాబుకు ఇక్కడ కనీసం ఓటు కూడా లేదని అన్నారు. మరోసారి సెంటిమెంటుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనేదాన్ని ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

నీచమైన విమర్శలా?
తెలంగాణ టీడీపీలో ఉన్నవారు తెలంగాణ బిడ్డలు కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. సీఎం ఉండి నీచమైన విమర్శలు చేయడానికి సిగ్గుండాలని కేసీఆర్ పై మండిపడ్డారు. కేసీఆర్ లాంటి అధముడు సీఎం కూర్చిలో కూర్చునేందుకు అనర్హుడని అన్నారు.

ఓటుకు నోటు కేసులో ఏం పీకుతాడు..
ఓటుకు నోటు కేసు గురించి పదే పదే మాట్లాడుతున్న కేసీఆర్.. తనను ఏం పీకుతాడో పీకమనండి అని రేవంత్ అన్నారు. పొత్తు కోసం చంద్రబాబు ఐదు కోట్లు, మూడు హెలికాప్టర్లు పంపాడంటున్న కేసీఆర్.. నీవు పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్ని కోట్లు తీసుకున్నావో లెక్క చెప్పు అంటూ నిలదీశారు. ఆంధ్రావాళ్లు అంటూ విమర్శలు చేస్తున్న కేసీఆర్‌కు అమరావతి వెళ్లినప్పుడు అది గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. తమ పార్టీలో వారికి టికెట్లు ఇచ్చి పక్క కూర్చోబెట్టుకున్నప్పడు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు.












Click it and Unblock the Notifications