కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి లేఖ; కేసీఆర్ సర్కార్ స్కామ్ పై సీబీఐ విచారణకు డిమాండ్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎంఆర్ పేరుతో ధాన్యం కుంభకోణం జరిగిందని ఆ లేఖలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణాలో ఎఫ్సీఐ గోదాములలో మాయమైన బియ్యంపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి లేఖలో వెల్లడించారు.

మిల్లర్లతో కుమ్మకై తెలంగాణా సర్కార్ ధాన్యం స్కాం: రేవంత్ రెడ్డి లేఖ

మిల్లర్లతో కుమ్మకై తెలంగాణా సర్కార్ ధాన్యం స్కాం: రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేయడంలో అవకతవకలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో వెల్లడించారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు ముఖ్యులు మిల్లర్లతో కుమ్మకై కుంభకోణానికి పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయల ధాన్యం కుంభకోణానికి పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి లేఖలో వెల్లడించారు.

2014 నుండి ఇప్పటి వరకూ సీఎంఆర్ కేటాయింపులపై సీబీఐ విచారణ జరిపించాలి

2014 నుండి ఇప్పటి వరకూ సీఎంఆర్ కేటాయింపులపై సీబీఐ విచారణ జరిపించాలి


తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకూ సీఎంఆర్ కేటాయింపులపై విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన మిల్లులను సీజ్ చేసి, మిల్లర్ల వద్ద నుండి దోపిడీ చేసిన సొమ్మును వసూలు చేయాలని రేవంత్ రెడ్డి లేఖ ద్వారా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బియ్యం రీసైక్లింగ్ పై కూడా విచారణ జరిపించాలని కోరారు.

 గవర్నర్ ను కలిసిన సమయంలోనూ ధాన్యం స్కాంపై ఫిర్యాదు

గవర్నర్ ను కలిసిన సమయంలోనూ ధాన్యం స్కాంపై ఫిర్యాదు


ఇక బుధవారం రాష్ట్ర గవర్నర్ ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేసిన సమయంలోనూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బియ్యం కుంభకోణంపై గవర్నర్ తమిళి సై కి సైతం ఫిర్యాదు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ కి అందజేయకపోవడం, ధాన్యం కొనుగోలు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యం కారణంగా మిల్లర్లు అధికారులతో చేతులు కలిపి రైతుల నుండి మద్దతుధర కంటే చాలా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేశారని, దీనిపైన కూడా సీబీఐ విచారణ జరిపించాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే సమయంలో వడ్లు బియ్యం మాయం చేసిన వాళ్ళ పై సిబిఐ విచారణ జరిపించాలని కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేసీఆర్ పై ఆగ్రహంతో ఉన్న కిషన్ రెడ్డి, రేవంత్ లేఖపై ఏం చేస్తారో ?

కేసీఆర్ పై ఆగ్రహంతో ఉన్న కిషన్ రెడ్డి, రేవంత్ లేఖపై ఏం చేస్తారో ?

ఇక తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఇదే విషయంలో లేఖ రాసి తెలంగాణ ప్రభుత్వం చేసిన ధాన్యం స్కాం విషయంలో సిబిఐ దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటికే తెలంగాణా సీఎం కెసీఆర్ పై కెసీఆర్ సర్కార్ విధానాలపై, ధాన్యం విషయంలో కెసీఆర్ ప్రభుత్వం చేసిన రాద్దాంతంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుంటారా? తెలంగాణాలో జరిగిన ధాన్యం కుంభకోణంపై విచారణ దిశగా అడుగులు వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+