కొడంగల్: ఉపఎన్నికలకు రెఢీ,రేవంత్ ప్లాన్ ఇదే, ప్రతివ్యూహంతో టిఆర్ఎస్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై రేవంత్‌రెడ్డి కేసులు వేశారు. అయితే రేవంత్‌ పార్టీ మారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే రాజకీయంగా విమర్శలు ఎదుర్కోనే అవకాశాలు లేకపోలేదు. దీంతో రేవంత్‌రెడ్డి పార్టీ మారితే మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.

ఆత్మరక్షణలో టిడిపి: నోరెత్తని మంత్రులు, రేవంత్‌పై వేటుకు ఒత్తిడి?

టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యవహరం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హట్ టాపిక్‌గా మారింది. ఏపీకి చెందిన మంత్రులు తెలంగాణ సీఎం కెసిఆర్‌తో లబ్దిపొందారని రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.

మోత్కుపల్లికి రేవంత్ షాక్:' నన్ను ప్రశ్నించే అధికారం లేదు', 'అతనో చీడపురుగు'

అంతేకాదు తెలంగాణలో ఏపీ మంత్రులకు ఏం పనంటూ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలతో పాటు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని రేవంత్‌రెడ్డి కలిశారనే ప్రచారం కూడ జోరుగా సాగుతోంది. అంతేకాదు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కూడ రేవంత్‌రెడ్డి కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

కెసిఆర్ కాళ్ళకు దండం పెడితే తప్పేంటీ: రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ ఫైర్

ఈ తరుణంలో తెలంగాణ టిడిపి నేతలపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ నేతలను ఆదేశించారు. కొందరు నేతలు పార్టీలు మారుతున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో రమణ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?

రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారితే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? ఆయన ఉప ఎన్నిక కోరుకుంటున్నారా? రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదే చర్చ జోరందుకుంది. అసెంబ్లీ సమావేశాల్లోనే తన ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయల్లో ఎవరూ ఊహించిన పరిణామాలు చోటు చేసుకుంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా ఎందుకు చేయాలి?

ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా ఎందుకు చేయాలి?

2014 ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి నుండి 15 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ విజయం సాధించారు. అయితే సుమారు 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరంతా కూడ అధికార టిఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యేలతో పాటు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కూడ టిఆర్ఎస్‌లో చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ కోర్టుల్లో కేసులు దాఖలు చేశారు. అంతేకాదు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు టిడిపి శాసనసభపక్షాన్ని టిఆర్ఎస్‌లో విలీనం చేసినట్టు స్పీకర్‌కు నోటీసును కూడ ఇచ్చారు. ఈ పరిణామాలపై రేవంత్ కోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లో చేరికపై కోర్టును ఆశ్రయించారు.అయితే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అనివార్యా పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఉపఎన్నికలు వస్తే రేవంత్ భవిష్యత్ కార్యాచరణ ఏమిటీ?

ఉపఎన్నికలు వస్తే రేవంత్ భవిష్యత్ కార్యాచరణ ఏమిటీ?

ఉపఎన్నికలు వస్తే రేవంత్ భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే విషయమై చర్చ సాగుతోంది. రేవంత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకర్గంలో టిడిపికి చెందిన కొందరు ముఖ్య నాయకులు మూడు రోజుల క్రితం టిఆర్ఎస్‌లో చేరారు. గతంలో కూడ కొందరు నేతలు టిఆర్ఎస్‌లో చేరారు. కొడంగల్ నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గం నుండి విజయం సాధించిన రేవంత్‌రెడ్డి ఈ దఫా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే చర్చ సాగుతోంది.

 ఉప ఎన్నికల్లో గెలిస్తే ఓకే... ఓడిపోతే ఎలా

ఉప ఎన్నికల్లో గెలిస్తే ఓకే... ఓడిపోతే ఎలా

ఉప ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి బరిలోకి దిగి విజయం సాధిస్తే రాజకీయంగా ఆయనకు ఎలాంటి ఇబ్బందులుండవు. కానీ, ఉప ఎన్నికల్లో ఓటమిపాలైతే మాత్రం రేవంత్‌రెడ్డి రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు లేకపోలేదు. అయితే తెలంగాణ సీఎం కెసిఆర్‌ను రాజకీయంగా ఇరుకున పెడుతున్న రేవంత్‌రెడ్డి ఉపఎన్నికల్లో పోటీచేస్తే ఆయనను దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ తీవ్రంగా పనిచేసే అవకాశం ఉంది. అంతేకాదు టిడిపి నుండి బయటకు వెళ్ళిన రేవంత్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీ కూడ పనిచేసే అవకాశాలు లేకపోలేదు. దీంతో రేవంత్‌కు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే తన సత్తాను చాటుకొనేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదనే ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is a spreading a rumour if Revanth Reddy may join in Congress he will resign to MLA post.Within six months Election commission will condut repoll for Kodangal assembly segment.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి