తుమ్ముల నాగేశ్వరరావును కలిసిన రేవంత్ రెడ్డి: కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఖాయం!
హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేత మల్లు రవి, తదితర నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించారు. రేవంత్ విజ్ఞప్తిపై తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
పాలేరు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల తన అనుచరులతో ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం నుంచి.. సుమారు 1000 కార్లు, 2000 బైక్‌లతో ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కనిపించలేదు.

ర్యాలీలో కేవలం తుమ్మల ఫొటో ఉన్న ఫ్లెక్సీలు, జెండాలు మాత్రమే దర్శనమిచ్చాయి. అనంతరం ఖమ్మంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రజల కోసం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు తుమ్మల. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా వస్తానని తెలిపారు. మీతో శభాష్ అనిపించుకుంటానని.. అప్పటి వరకూ తలవంచే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో తనను తప్పించానని కొందరు ఆనందపడొచ్చని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తాను ఎవరినీ నిందించ తలచుకోలేదని అన్నారు. తన రాజకీయ జీవితం ప్రజల చేతుల్లోనే ఉందని.. జిల్లా అభివృద్ధి కోసం జీవితం అంకితం చేశానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గురువారం తుమ్మలతో కాంగ్రెస్ నేతలు సమావేశమై.. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

ఈ క్రమంలో తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే హస్తం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తుమ్మల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పాలేరు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ వర్గాలు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు చేరితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో మరింత బలోపేతమవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇది ఇలావుండగా, ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో గెలిచేందుకు అవకాశం ఉన్న నేతలను.. సర్వేల ద్వారా దాదాపుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. గెలిచే నేతలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications