నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై రేవంత్ రెడ్డి పాత వీడియో వైరల్.. అప్పుడలా ,ఇప్పుడిలా
తెలంగాణ రాజకీయాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్‌గా మారింది. శనివారం ఉదయం ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై కొరడా ఝుళిపించింది. అక్రమంగా చెరువును అక్రమించి నిర్మించారని తేలడంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను అధికారులు కూల్చివేశారు. నాగార్జున తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందడంతో భారీ బందోబస్తు నడుమ ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపైనా ఫిర్యాదుల వచ్చాయి.
ఎన్ కన్వెన్షన్‌ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో, ఈ నిర్మాణం కు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. అయితే, నాగార్జునకు చెందిన నిర్మాణం కావటంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవ్వరినీ వదిలిపెట్టేది హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ స్పష్టం చేశారు.

దీనిపై స్పందించిన నాగార్జున రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలోని తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయడాన్ని అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు.స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు.
ఇదిలా ఉంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 2016లో టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడంపై అసెంబ్లీలో ప్రస్తావించారు.సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరోలు అక్రమదారులు పడుతున్నారని, చెరువుకు అడ్డంగా గోడ కట్టి ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌ను నిర్మించారని ఇది అక్రమ నిర్మాణం అని పదే పదే మీడియాలో కథనాలు వచ్చినా నాగార్జునకు సంబంధించి ఈ అక్రమ నిర్మాణంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చర్యలు తీసుకోకుండా ఏ శక్తి అడ్డు పడుతున్నది? ఎప్పటి వరకు చర్యలు తీసుకుంటారని సభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హైడ్రా రూపంలో ఎన్ కన్వెన్షన్ హాల్ నేల మట్టం చేయడంతో రేవంత్ రెడ్డి పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications