Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిఖార్సయిన కాంగ్రెస్ వాదులైతే మునుగోడుకు రండి..కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి బహిరంగలేఖ!!

టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఒకపక్క మునుగోడులో ఆడబిడ్డ ఎన్నికల బరిలోకి దిగింది అని సెంటిమెంట్ రగిలించడానికి పనిచేస్తూనే, మరోపక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పార్టీ కోసం పని చేయాలని ఉత్సాహాన్ని రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు.

 పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ


రేవంత్ రెడ్డి తెలంగాణ నలుమూలల నుంచి కాంగ్రెస్ లీడర్లు ఉన్నపళంగా కదలిరావాలని, మునుగోడులో కలిసి కదం తొక్కు దామని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా ఈ క్షణమే మునుగోడు తరలిరావాలని అందరి కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆయన కాంగ్రెస్ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీని మునుగోడులో గెలిపించుకోవటం అందరి అవసరం అన్నారు.

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వెనుకంజ .. అందుకే రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వెనుకంజ .. అందుకే రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించవలసిన స్టార్ క్యాంపెయినర్లు మునుగోడు లో ఎన్నికల ప్రచారాన్ని సాగించటం లేదు. చాలా మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు, సీనియర్లు మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో మునుగోడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయింది. ఇక సొంత పార్టీ నేతల ఆడియోలు, వీడియోలు కలకలం రేపడం తో తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి మునుగోడు లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవటం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులను రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు.

దుష్ట శక్తులన్నీ ఏకం అయ్యాయి..

దుష్ట శక్తులన్నీ ఏకం అయ్యాయి..

కాంగ్రెస్ ను అంతం చేయాలని టీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నాయని, దుష్ట శక్తులన్నీ ఏకం అయి తమను ఒంటరిని చేయాలని చూస్తున్నాయని, కాంగ్రెస్ భిక్షతో ఎదిగిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నారని, కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఇన్ని కుట్రలు చేస్తున్నారని పేర్కొన్న రేవంత్ రెడ్డి నిఖార్సయిన కాంగ్రెస్ వాదులు మునుగోడు కదలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పోలీసులు, స్థానిక అధికరణాన్ని టిఆర్ఎస్ విచ్చలవిడిగా వాడుకుంటోందని, సిఆర్పిఎఫ్, ఎలక్షన్ కమిషన్ ను బిజెపి దుర్వినియోగం చేస్తోందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

పాల్వాయి స్రవంతిపై రాళ్ళ దాడి జరిగినా చూస్తూ ఊరుకుంటామా?

పాల్వాయి స్రవంతిపై రాళ్ళ దాడి జరిగినా చూస్తూ ఊరుకుంటామా?

ఆఖరికి పవిత్రమైన యాదగిరిగుట్ట నరసింహ స్వామి దేవస్థానం కూడా రాజకీయాలకు వేదికగా మార్చటం దీనికి పరాకాష్ట అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
మునుగోడు ని కేవలం ఉప ఎన్నిక గానే చూడలేము అన్నారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా పాల్వాయి స్రవంతి పై రాళ్ల దాడికి పాల్పడ్డారని మండిపడిన రేవంత్ రెడ్డి మన కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే సైలెంట్ గా చూస్తూ ఊరుకుంటామా? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ ఎఫెక్ట్ ఉంటుందా?

రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ ఎఫెక్ట్ ఉంటుందా?

రేవంత్ రెడ్డి తెలంగాణ నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులకు తరలి రండి.. మునుగోడు లో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం అంటూ పిలుపునిచ్చారు. మీ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉద్వేగాన్ని రగిల్చే ప్రయత్నం చేశారు. మరి రేవంత్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఎంతమంది కాంగ్రెస్ శ్రేణులను మునుగోడు బాట పట్టిస్తున్నదనేది తెలియాల్సి ఉంది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+