నేటి నుండే రేవంత్ రెడ్డి పాదయాత్ర: సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదంతో.. షెడ్యూల్ ఇలా!!

నేటి నుండే రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికలకు మరికొద్ది నెలలు ఉండగానే రేవంత్ రెడ్డి కూడా సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదంతో పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. రేవంత్ పాదయాత్ర షెడ్యూల్ ఇలా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న అన్ని రాజకీయ పార్టీలు పాదయాత్రల పేరుతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళితే, ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర సాగిస్తున్నారు. ఇక తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేటి నుండి పాదయాత్రకు రెడీ అయ్యారు.

నేటి నుండే రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర .. అక్కడ నుండే షురూ

నేటి నుండే రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర .. అక్కడ నుండే షురూ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేటినుండి హాత్ సే హాత్ జోడో పాదయాత్రను నిర్వహించనున్నారు. ఈ మేరకు మొదటి రెండు రోజుల షెడ్యూల్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. నేడు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని అక్కడినుండి తన పాదయాత్రను ప్రారంభించనున్నట్టు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. ఇక టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మల గద్దె వద్ద నుండి పాదయాత్రను ప్రారంభిస్తుండగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరు నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని సమాచారం.

మహాబూబాబాబాద్ లోక్సభ పరిధిలో 10రోజుల పాటు రేవంత్ పాదయాత్ర

మహాబూబాబాబాద్ లోక్సభ పరిధిలో 10రోజుల పాటు రేవంత్ పాదయాత్ర

రాహుల్ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరవేయాలని ఏఐసీసీ నిర్దేశం మేరకు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. పార్టీ నాయకులు అందరూ ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహిస్తారని మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో 10 రోజులపాటు సాగే ఈ పాదయాత్రలో తాను కూడా పాల్గొంటున్నానని సీతక్క తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటు, బందోబస్తు కల్పించాలని ఇప్పటికే పోలీసులను విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే సీతక్క రేవంత్ రెడ్డి నేడు, రేపు పర్యటన షెడ్యూల్ ను ప్రకటించారు.

నేడు షెడ్యూల్ ఇలా.. మేడారం నుండి పాదయాత్ర ప్రారంభం

నేడు షెడ్యూల్ ఇలా.. మేడారం నుండి పాదయాత్ర ప్రారంభం

ఇక షెడ్యూల్ ఎలా ఉంది అంటే.. ఉదయం 11 గంటలకు ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమ్మక్క సారలమ్మ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లను దర్శించుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంట నుండి మేడారం గుడి నుంచి పాదయాత్రగా బయలుదేరి తాడ్వాయి మండలంలోని కొత్తూరు, నార్లాపూర్, వెంగలాపూర్ గ్రామాల మీదుగా గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్టు నగర్ గ్రామానికి చేరుకుంటారు.

పస్రా జంక్షన్ లో రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్

పస్రా జంక్షన్ లో రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్

రెండు నుండి రెండున్నర గంటల వరకు ప్రాజెక్టు నగర్ లోనే భోజన విరామం ఉంటుందని, అనంతరం రెండున్నర గంటలకు ప్రాజెక్టు నగర్ నుంచి బయలుదేరి పాదయాత్ర సాయంత్రం 4:30 గంటల వరకు పస్రాకు చేరుకుంటుందని, సాయంత్రం నాలుగున్నర గంటల నుండి 5 గంటల వరకు టీ విరామం ఉంటుందని, ఐదు గంటల నుండి 6:00 వరకు పస్రా జంక్షన్లో కార్నర్ మీటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు వస్త్రా గ్రామం నుండి నుంచి గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్ మీదుగా జవహర్ నగర్, జంగాలపల్లి క్రాస్, ఇంచర్ల, వెంకటాపూర్ క్రాస్ రోడ్డు మీదుగా పాలంపేటకు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారని ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు.

మంగళవారం షెడ్యూల్ ఇలా..

మంగళవారం షెడ్యూల్ ఇలా..

ఇక మంగళవారం నాడు ఉదయం 8:30కు పాలింపేట నుంచి బయలుదేరి రామాంజపూర్, చెంచు కాలనీ, నారాయణగిరి పల్లె మీదుగా బుద్ధారం గ్రామానికి చేరుకుంటారని, అక్కడ భోజన విరామం ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి బుద్ధారం గ్రామం నుంచి కేశవాపూర్, నర్సాపూర్, బండారుపల్లి మీదుగా సాయంత్రం 6 గంటల వరకు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారని, ములుగు జిల్లా కేంద్రంలో సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద కార్నర్ మీటింగ్ కొనసాగుతుందని సీతక్క తెలిపారు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. మరి ఈ పాదయాత్రలో రేవంత్ రెడ్డి అండ్ టీం ఎంత మేరకు సక్సెస్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+