జగన్, వైయస్ దారిలో.. కేసీఆర్‌పై రేవంత్ అస్త్రం, పార్టీలో పట్టుకోసం: ఆ దారిలో ఉండొచ్చు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొందరు ఆ దిశలో చర్చలు జరుపుతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, ఇప్పుడు జగన్ పాదయాత్రలు చేస్తున్నారు. అదే దారిలో రేవంత్ నడవనున్నారని తెలుస్తోంది. కాగా, గతంలో వైయస్ చేవెళ్ల నుంచి  ప్రారంభించారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే దారిలో నడవనున్నారని భావిస్తున్నారు.

అంతుందా?: షాకిచ్చిన అనుచరులు, రేవంత్ దూకుడుకు కాంగ్రెస్ ఝలక్

తెరాసకు ధీటుగా మరింత ఎదిగేందుకు

తెరాసకు ధీటుగా మరింత ఎదిగేందుకు

త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే రేవంత్ చేరికతో తెరాసకు ధీటుగా తయారవుతున్నామనే అభిప్రాయం కాంగ్రెస్ కేడర్‌లో కనిపిస్తోంది. ఇప్పుడు రేవంత్ పాదయాత్రపై చర్చ సాగుతోందని తెలుస్తోంది.

ఏం చేస్తానో చెబుతున్న రేవంత్ రెడ్డి

ఏం చేస్తానో చెబుతున్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో తనకు అందరిని మచ్చిక చేసుకునేందుకు, పదవి కోసం అందరి మద్దతు కూడగట్టుకునేందుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆ పార్టీ సీనియర్లను కలుస్తున్నారు. ఇందులో భాగంగా తాను ఎలా ముందుకు వెళ్తాననే విషయాన్ని కూడా సీనియర్ నేతలతో రేవంత్ చెబుతున్నారని తెలుస్తోంది.

పాదయాత్ర ఆలోచన, తనదైన ముద్ర కోసం రేవంత్

పాదయాత్ర ఆలోచన, తనదైన ముద్ర కోసం రేవంత్

కేసీఆర్‌ను ఎదుర్కోగలిగే నేతగా రేవంత్‌ను ఇప్పటికే కాంగ్రెస్ కేడర్ భావిస్తోంది. ఆయన కూడా కాంగ్రెస్‌లోను తనను తాను నిరూపించుకోవడంతో పాటు, తనదైన ముద్ర వేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం పాదయాత్ర ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

డిసెంబర్‌లో ప్రారంభం కావొచ్చని ప్రచారం

డిసెంబర్‌లో ప్రారంభం కావొచ్చని ప్రచారం

రేవంత్ రెడ్డి పాదయాత్ర త్వరలో కొలిక్కి వచ్చే అవకాశముందని, డిసెంబర్ తర్వాత ప్రారంభమయ్యే అవకాశముందనే ప్రచారం సాగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడటంతో పాటు రేవంత్‌కు వ్యక్తిగత మైలేజ్ తీసుకు వస్తుందని అంటున్నారు.

పాదయాత్ర అలా ఆ దారిలో ఉండొచ్చా

పాదయాత్ర అలా ఆ దారిలో ఉండొచ్చా

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పలువురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే తెలంగాణ కోసం ఉద్యమం సమయంలో చాలామంది చనిపోయారు. ఇలాంటి వారిని కలుసుకుంటూ పాదయాత్ర కొనసాగే అంశంపై చర్చ సాగుతోందని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Revanth Reddy has now decided to undertake a padayatra through the length and breadth of the state to establish himself as a strong mass leader. By doing so, he also wants to emerge as a major contender for the CM post from the grand old party. After getting the nod of AICC high command, the young leader will announce the schedule of his padayatra, which he is likely to begin in December.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి