Revanth Reddy: అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ధరణి సమస్య పరిష్కరిస్తాం..

ధరణితో పేదలు ఇబ్బంది పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ధరణి సమస్య పరిష్కరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పూర్ లో ధరణిపై కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ధరణి బాధితుల సమస్యలు తెలుసుకొని గ్రామస్తులకు హామీ కార్డులు అందజేశారు. 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ రైతుల సమస్యలపై పోరాడిందని గుర్తు చేశారు.

అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ పేదల కోసం కాదని, భూస్వాముల కోసం మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 22 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేసిందని చెప్పారు. ధరణి ద్వారా 9 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ ను తొలగిస్తేనే సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

Revanth Reddy promised to solve the Dharani problem within 100 days of coming to power in telangana

ధరణి పోర్టల్ తో ఎదురవుతోన్న సమస్యలపై ఇప్పటికే టీపీసీసీ ఆధ్వర్యంలో సర్వే ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గన్నారు. పేదలకు పంచిన భూములను ధరణి చట్టంలోకి రాకుండా పక్కనబెట్టారని భట్టి ఆరోపించారు. వారికి పాస్ బుక్ లు రాక అధికారుల చుట్టు తిరుగుతున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+